దిగ్గజ దర్శకుడి సీక్రెట్ స్ట్రాటజీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కొమురం భీమ్ జయంతి సందర్భంగా ట్రిపుల్ ఆర్ నుంచి ఏదొక అప్‌డేట్ ఉంటుందని ఆశించిన సినీ జనానికి -జక్కన్న షాకిచ్చాడు. మంచి సందర్భం వచ్చినా ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేయకుండా -సీక్రెట్ స్ట్రాటజీని రాజవౌళి మెయిన్‌టెన్ చేస్తున్నాడు. ‘స్వాతంత్య్రం కోసం పోరాటం సలిపిన యోధుడు కొమురం భీమ్ జయంతి రోజున ఆయనకు నివాళి. ట్రిపుల్ ఆర్‌లో ఎన్టీఆర్‌ను యంగ్ భీమ్‌గా వెండితెరపై చూపించేందుకు మేమూ ఆశగాఉన్నాం’ అన్న ఓ ట్వీట్‌తో సందర్భాన్ని సరిపెట్టేశాడు. కొమురం భీమ్ జయంతి సందర్భంగా మంగళవారం -ట్రిపుల్ ఆర్ టీంనుంచి ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్ రావొచ్చని అంతా ఆశించారు. సినిమా సంగతుల్ని సీక్రెట్‌గా ఉంచుతోన్న జక్కన్న టీం -ఈ విషయంలోనూ తొందర చూపించలేదు. తెలంగాణ బిడ్డ కొమురం భీమ్, ఆంధ్ర బిడ్డ అల్లూరి కథలను కాల్పానిక చిత్రంగా దర్శకుడు రాజవౌళి తెరకెక్కిస్తుండటం తెలిసిందే. ఒకే కాలమానానికి చెందని వ్యక్తులే అయినా -స్వాతంత్రోద్యమానికి ముందు వాళ్ల జీవితం.. ఉద్యమంవైపు నడవడానికి ప్రేరణ అన్న అంశాలే సెంట్రిక్‌గా చారిత్రక ఊహాచిత్రాన్ని చెక్కుతున్నాడు జక్కన్న. అల్లూరి, భీమ్ పాత్రలను రామ్‌చరణ్, ఎన్టీఆర్ పోషిస్తుండటంతో -మల్టీస్టారర్‌పై భారీ అంచనాలు లేకపోలేదు. అయితే సినిమాకు సంబంధించి ఎలాంటి అప్‌డేట్స్ ఇవ్వకుండా సైలెంట్‌గా పని చేసుకుపోతున్న జక్కన్న -్భమ్‌కు నివాళిగా ఆ పాత్ర పోషిస్తున్న ఎన్టీఆర్ ఫస్ట్‌లుక్‌ని ఇస్తాడనుకున్నా, ట్వీట్‌తోనే సరిపెట్టేశాడు. అనుకున్న సమయానికి సినిమాను తెచ్చే అవకాశం లేకపోవడంతో -ఇంత ముందుగా హీరోల లుక్‌లు వదలటం మంచిదికాదన్న ఉద్దేశమై ఉండొచ్చని కొందరు అంటున్నారు. ట్రిపుల్ ఆర్‌నుంచి పెద్దగా అప్‌డేట్స్ ఇవ్వకపోవడం కూడా -రాజవౌళి స్ట్రాటజీలో భాగమై ఉండొచ్చనీ వినిపిస్తోంది. అల్లూరి పాత్రకు జోడీగా బాలీవుడ్ భామ ఆలియాభట్ నటిస్తుంటే.. కొమురం పాత్రకు ఇప్పటికీ హీరోయిన్ ఫిక్స్ కాలేదు. హాలీవుడ్ భామ డైసీ ఎడ్గర్ ప్రాజెక్టునుంచి వెనక్కి వెళ్లిపోవటంతో -ఆమె ప్లేస్ అలాగే ఉండిపోయింది. ఎవర్ని తీసుకోవచ్చన్న అంచనాలకూ జక్కన్న ఆస్కారం ఇవ్వకపోవడం గమనార్హం. టైటిల్ నుంచి ప్రతి విషయంలో సీక్రెసీ మెయిన్‌టెన్ చేయడం సరికొత్త ప్రమోషనల్ స్ట్రాటజీ అయివుండొచ్చన్న చర్చ నడుస్తోంది. ట్రిపుల్ ఆర్‌లో బాలీవుడ్ నటుడు అజయ్ దేవగణ్ ముఖ్య పాత్ర పోషించనుండటం తెలిసిందే. సినిమా డ్రాపవుతున్న టైంలో ఒక్క యాక్షన్ సీన్‌తో పైకిలేపై దర్శకుడు రాజవౌళి. ట్రిపుల్ ఆర్ విషయంలోనూ విసిగించి విసిగించి ఒక్కసారిగే పైకి లేపొచ్చనీ అభిమానులు సరిపెట్టుకుంటున్నారు.