మత్తు...లో కీరవాణి కొడుకు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెలుగు తెరపై మరో వారసుడు అరంగేట్రం చేస్తున్నాడు. లెజెండరీ మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి చిన్న కొడుకు సింహా హీరోగా పరిచయమవుతున్న చిత్రం -మత్తువదలరా. సినిమా ఫస్ట్‌లుక్‌ను జూనియర్ ఎన్టీఆర్ విడుదల చేశాడు. ఇదే సినిమాతో కీరవాణి పెద్దకొడుకు కాలభైరవ సంగీత దర్శకుడిగా పరిచయమవుతుండటం మరో విశేషం. ‘కాలం పరిగెడుతుంది. తమ్ముళ్లులాంటి సింహా, కాలభైరవ చూస్తుండగానే పెద్దవాళ్లయ్యారు. ఇద్దరూవున్న సినిమా ఫస్ట్‌లుక్ నేను లాంచ్ చేయడం హ్యాపీగా ఉంది’ అంటూ ఈ సందర్భంగా వ్యాఖ్యానించాడు ఎన్టీఆర్.
కీరవాణి ఫ్యామిలీతో తారక్ అనుబంధం ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఆ అనుబంధంతోనే కీరవాణి కొడుకులకు ఎన్టీఆర్ ప్రమోట్ చేస్తున్నాడని అంటున్నారు. ఫస్ట్‌లుక్‌లో సింహాను పూర్తిగా రివీల్ చేయకుండా -మత్తెక్కి పడివున్న కుర్రాడిగా డిజైన్‌చేసి వదిలారు. బ్యాగ్రౌండ్‌లో న్యూస్‌పేపర్ క్లిప్పింగ్స్‌ని చూపిస్తూ -సినిమా కానె్సప్ట్‌పై ఆసక్తి రేకెత్తించారు. మైత్రీ మూవీ మేకర్స్ రూపొందిస్తున్న చిత్రంతో రితేష్‌రాణా దర్శకుడిగా పరిచయమవుతున్నాడు. పోస్టర్ చూస్తే కానె్సప్ట్ బేస్డ్ మూవీ అని అర్థమవుతుంది. నవంబర్‌లో ప్రేక్షకుల ముందుకొచ్చే అవకాశముంది.