ఆమెలో ఈమైతే..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమలాపాల్ న్యూడ్ సీన్స్ చేసిన సినిమా -ఆడై. ఈ ఏడాది ద్వితీయార్థంలో విడుదలైన సినిమా సెనే్సషన్ క్రియేట్ చేసింది కానీ సక్సెస్ సాధించలేకపోయింది. కథ డిమాండ్ చేయడంతో కొన్ని సన్నివేశాల్లో అమలపాల్ న్యూడ్‌గా కనిపించిందన్న ప్రచారం పెద్దఎత్తున జరిగింది. ఇక తెలుగు వర్షన్‌కు వచ్చేసరికి -మితిమీరిన ఆ ప్రచారం అర్థంలేని ఆలోచనలకు తెరలేపింది. వెండితెరపై నీలి చిత్రం చూపించినంత భయానకంగా.. విడుదలకు ముందు -అమలాపాల్ న్యూడ్ సీన్స్‌కు ఎక్స్‌పోజర్ రావడంతో సినిమా స్టేటస్సే మారిపోయింది. కథానుసారం ఉమెన్ స్ట్రగుల్ కోణంలో చూడాల్సిన సన్నివేశాలను.. మనసులోని వికారపు ఆలోచనలతో మిళితం చేసి చూడాల్సి రావడానికి కారణం ‘న్యూడ్’ ప్రచారమే. నిజానికి నటిగా అమలాపాల్ సాహసమే చేసినా, ఆడై చిత్రంతో ఆమెపై అదోలాంటి ముద్రే పడింది. ఆమె పెర్ఫార్మెన్స్, గట్స్‌కు విమర్శకుల నుంచి ప్రశంసలైతే వచ్చాయికానీ, సినిమాకు సక్సెస్ దక్కలేదు. అయితే ‘న్యూడ్’ ఎక్స్‌పోజర్‌ను చెరిపేసి.. కథకు ‘క్లాసిక్’ టచ్ ఇస్తే బాలీవుడ్ జనానికి కనెక్టవ్వడం ఖాయమన్న ఆలోచన చేస్తున్నాడట విక్రమ్ భట్. హిందీ రీమేక్ హక్కుల్ని సొంతం చేసుకున్న విక్రమ్‌భట్, లీడ్‌రోల్‌కి కంగనా అయితే న్యాయం చేయగలదని భావిస్తున్నాడట. ఇప్పటికే ఆమెతో సంప్రదింపులు జరుపుతున్నట్టు బాలీవుడ్‌లో వినిపిస్తోంది. తను చేసే సినిమాల్లో ఒకింత ఎక్కువ ఇన్వాల్వ్‌మెంట్ ఆశించే కంగన -్భట్ ప్రతిపాదనకు ఓకే అంటే ప్రాజెక్టు సెట్టైనట్టే. ప్రతిభావంత నటి కంగన కనుక ఈ సినిమా చేస్తే.. కథను పరిపక్వతకు చేర్చడమే కాదు, న్యూస్ సీన్స్‌కి క్లాసిక్ టచ్ తేవడం ఖాయమన్న అభిప్రాయాలు వినిపిస్తున్నాయి.