అదే సీక్రెట్..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జెర్సీ చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన శ్రద్ధా శ్రీనాధ్ ప్రస్తుతం దక్షిణాదిలో అన్ని భాషల్లో నటిస్తోంది. ప్రస్తుతం తాను తన గ్లామర్‌ను కాపాడుకోవడానికి దృష్టి పెట్టానని చెబుతోంది. గతంలో ఓసారి ఫారిన్ ట్రిప్‌కు వెళ్లినపుడు చేతిలో చాలా డబ్బు ఉండడంతో ఇష్టం వచ్చినట్లుగా ఖర్చుచేస్తూ, అనేకరకాల ఫుడ్స్ టేస్ట్ చేశానని, దానికితోడు వ్యాయామం చేయడం ఓ సంవత్సరంపాటు మర్చిపోయానని అంటోంది. ఇన్ని తప్పులు చేయడంవల్లే తాను ఈమధ్య బాగా బరువెక్కడంతో నన్ను నేను ప్రశ్నించుకుంటూ మళ్లీ పాత గ్లామర్‌ను తీసుకురావలన్న ప్రయత్నంలో మునిగిపోయానని చెబుతోంది. అందుకే తన అపార్ట్‌మెంట్‌లోనే వున్న ఓ జిమ్‌కు వెళుతోందట. రోజురోజుకూ వ్యాయామం చేసే సమయాన్ని పెంచుకుంటూ దాదాపు 18 కేజీలు బరువు తగ్గిందట. కానీ అనుకోకుండా ఒకేసారి బరువు తగ్గడంతో అనారోగ్యం కూడా చుట్టుముట్టింది. సాధారణంగా తీసుకునే డైట్ కూడా తీసుకోకపోవటంతో ఏమైనా సరే మళ్లీ తాను ఫామ్‌లోకి రావాలన్న కృతనిశ్చయంతో పనిచేశానని చెబుతోంది. అంత కష్టపడ్డానికి ప్రధాన టార్గెట్ గ్లామరేనంటోంది. గ్లామర్ కోసమేతాను ఏదిచేసినానని చెబుతోంది. అందుకే ఇప్పుడు పూర్తిగా ఫామ్‌లోకి వచ్చానని, ఆరోగ్యం కూడా వ్యాయామంతో చక్కబడిందని, ఇందుకు చాలా ఆనందంగా ఉందని చెబుతోంది. మొత్తానికి తన గ్లామర్ సీక్రెట్ ఏంటో చెప్పేసింది!