కేక పెట్టిస్తానంటున్న రాజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్.కె.స్టూడియోస్ పతాకంపై కృష్ణ కిశోర్ దర్శకత్వంలో రేవంత్, నోయల్ ప్రధాన తారాగణంగా రూపొందిస్తున్న చిత్రం ‘రాజా.. మీరు కేక’ (వర్కింగ్ టైటిల్) సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం సంస్థ కార్యాలయంలో లాంఛనంగా మొదలైంది. హీరోపై కె.రాఘవేంద్రరావు క్లాప్ ఇవ్వగా సినిమాను ప్రారంభించారు. ఈ సందర్భంగా చిత్ర నిర్మాత రాజ్‌కుమార్ మాట్లాడుతూ, సినిమాలో హీరోయిన్‌గా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితురాలైన ఓ నాయిక నటించనుందని, మే రెండవ వారం నుండి మొదటి షెడ్యూల్ ప్రారంభం కానున్నదని తెలిపారు. దర్శకుడు కృష్ణకిశోర్ మాట్లాడుతూ, గతంలో తాను దృశ్యం సినిమాకు కోడైరెక్టర్‌గా పనిచేశానని, ఈ చిత్రాన్ని విజయవంతంగా ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి కృషిచేస్తానని తెలిపారు. ఈ చిత్రానికి కెమెరా:రాంరెడ్డి, సంగీతం:శ్రీచరణ్, నిర్మాత:రాజ్‌కుమార్.ఎం., దర్శకత్వం:కృష్ణకిశోర్.