కొత్త కల్యాణ్‌రామ్‌ను చూస్తారు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నందమూరి కళ్యాణ్‌రామ్ కథానాయకుడిగా పూరి జగన్నాధ్ దర్శకత్వంలో ఎన్టీఆర్ ఆర్ట్స్ పతాకంపై రూపొందిస్తున్న ఓ చిత్రానికి సంబంధించిన ప్రారంభోత్సవ కార్యక్రమం జరిగింది. నటరత్న ఎన్టీరామారావు చిత్ర పటంపై ఎన్టీఆర్ క్లాప్‌నివ్వగా పూరి జగన్నాధ్ కెమెరా స్విచ్చాన్ చేశారు. కొరటాల శివ తొలి సన్నివేశానికి గౌరవ దర్శకత్వం వహించారు. హరికృష్ణ, రామకృష్ణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో దర్శకుడు పూరి జగన్నాధ్ మాట్లాడుతూ రొమాన్స్, యాక్షన్ ఎంటర్‌టైన్‌మెంట్‌గా సాగే ఈ చిత్రం సరికొత్త స్టైల్లో సాగే మాస్ కమర్షియల్ ఎలిమెంట్‌తో వుంటుందని, ఇందులో కొత్తగా వుండే కల్యాణ్‌రామ్‌ను చూస్తారని తెలిపారు. మే నెలలో రెగ్యులర్ షూటింగ్ ప్రారంభించి స్పెయిన్‌లో ఓ షెడ్యూల్ చేస్తామని, కల్యాణ్‌రామ్ ఇమేజ్ మరింత పెరిగేలా ఈ సినిమా వుంటుందని ఆయన అన్నారు. పూరి జగన్నాధ్‌తో ఈ సినిమా చేయడం ఆనందంగా వుందని, ఆయన చెప్పిన కథ విన్నప్పటినుండి మరింత ఉత్సాహం పెరిగిందని, తన కెరీర్‌లో ఇదో టర్నింగ్ పాయింట్‌గా నిలిచే చిత్రం అవుతుందని కథానాయకుడు కల్యాణ్‌రామ్ అన్నారు. అతిథి ఆర్య కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రంలో జగపతిబాబు ఓ కీలక పాత్రలో నటిస్తారు. ఈ చిత్రానికి మిగతా తారాగణం ఎంపిక జరుగుతోంది. ఈ సినిమాకు సంగీతం:అనూప్ రూబెన్స్, కెమెరా:ముఖేష్, నిర్మాత:నందమూరి కళ్యాణ్‌రామ్, కథ, మాటలు, స్క్రీప్లే, దర్శకత్వం:పూరి జగన్నాధ్.

చిత్రం కల్యాణ్‌రామ్ కొత్త సినిమాను శుక్రవారం క్లాప్ కొట్టి ప్రారంభిస్తున్న ఎన్‌టిఆర్