ఇక అమీతుమీ!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘ఐ’ చిత్రంతో పరుగులో వెనకపడిన అమీ జాక్సన్ ఇక అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటోంది. ‘ఐ’ చిత్రం శంకర్ దర్శకత్వంలో విడుదలైనపుడు ఆ చిత్రంతో తనకు అవకాశాలు బాగా వస్తాయని ఆశించింది. కానీ ఆ చిత్రం అనుకున్నంత విజయం పొందకపోవడం అమీకి మైనస్‌గా మారింది. అందుకే తాజాగా ఎప్పటికప్పుడు తన సోషల్ నెట్‌వర్క్ వెబ్‌సైట్లలో సంచలనాలు రేపే ఫొటోలను పెట్టి బాలీవుడ్ దర్శక నిర్మాతలను ఆకట్టుకుంటోంది. ఆమె ఫొటోలకోసం తదితర నెట్‌వర్క్‌లను వీక్షించే ఫాలోవర్స్ సంఖ్య కూడా బాగానే వుందట. అందుకే ఇక ముంబయిలోనే తిష్టవేసి అమీ తుమీ తేల్చుకోవాలనుకుంటోంది అమీ జాక్సన్. తాజాగా ముంబయిలో ఓ ఖరీదైన ప్రాంతంలో త్రిబుల్ బెడ్‌రూమ్ ఇల్లు కొనుక్కొని మరీ సవాల్ విసురుతోంది. ఇక ముంబయిలోనే వుంటానని, అవకాశాలు వచ్చేదాకా వదిలిపెట్టేది లేదని అంటోంది. ప్రస్తుతం అమీ జాక్సన్ శంకర్ దర్శకత్వంలో రజనీకాంత్‌తో రూపొందిస్తున్న రోబో-2 చిత్రంలో కథానాయికగా నటిస్తోంది.

చిత్రం అమీ జాక్సన్