పోస్ట్ ప్రొడక్షన్‌లో ఆమె.. అతడైతే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హనీష్, చిరాశ్రీ జంటగా శ్రీ కనకదుర్గ ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై కె.సూర్యనారాయణ దర్శకత్వంలో ఎం.మారుతి ప్రసాద్, ఎన్.రాధాకృష్ణ సంయుక్తంగా రూపొందిస్తున్న చిత్రం ‘ఆమె అతడైతే’. ఈ చిత్రానికి సంబంధించిన షూటింగ్ పూర్తిచేసి పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా దర్శకుడు కె.సూర్యనారాయణ మాట్లాడుతూ, గ్రామీణ నేపథ్యం నుండి పట్టణానికి వచ్చిన ఓ కుర్రాడు తన లక్ష్యంకోసం ఎలా శ్రమించాడు, చివరికి ఎలా సాధించాడు అనే కథాంశంతో ఫుల్ లెంగ్త్ లవ్ కామెడీ ఎంటర్‌టైనర్‌గా ఈ చిత్రాన్ని రూపొందించామని, కథకి ఖచ్చితంగా సరిపోవడంతో ఆ పేరునే నిర్ణయించామని తెలిపారు. క్లాసికల్ డాన్సర్‌గా ఇంటర్నేషనల్ గుర్తింపు తెచ్చుకున్న హనీష్ ఈ సినిమాలో హీరోగా నటించారని, కన్నడ చిత్రాలలో మంచి పేరున్న చిరాశ్రీ కథానాయికగా పరిచయమవుతుందని అన్నారు. దర్శకుడు చెప్పిన కథ, కథనాలు నచ్చడంతో ఈ సినిమా మొదలుపెట్టామని, ఎటువంటి అంతరాయం లేకుండా పూర్తయిందని, ఈనెలలోనే ఆడియోను విడుదల చేసి నెలాఖరుకు సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సన్నాహాలు చేస్తున్నామని నిర్మాతలు ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ తెలిపారు. కొత్తదనమున్న చిత్రాలను ఆదరించినట్లే ఈ చిత్రాన్ని కూడా ప్రేక్షకులు ఆదరిస్తారన్న నమ్మకం వుందని వారన్నారు. భానుచందర్, అలీ, తనికెళ్ల భరణి, సుధ తదితరులు నటించిన ఈ చిత్రానికి సంగీతం:యశోకృష్ణ, కెమెరా:హనూ కాక, పాటలు:సుద్దాల, ఎడిటింగ్:మార్తాండ్ కె.వెంకటేష్, నిర్మాతలు:ఎం.మారుతిప్రసాద్, ఎన్.రాధాకృష్ణ, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం:కె.సూర్యనారాయణ.