అమ్మలు గర్వపడేలా.. తిప్పరా మీసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జోడీగా అసుర దర్శకుడు విజయ్‌కృష్ణ తెరకెక్కిస్తోన్న చిత్రం -తిప్పరా మీసం. రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణ విజయ్ ప్రొడక్షన్స్ పతాకాలపై శ్రీహోమ్ సినిమాస్ సమర్పణలో యువ నిర్మాత రిజ్వాన్ నిర్మిస్తున్న చిత్రం. నవంబర్ 8న సినిమా విడుదలవుతోన్న నేపథ్యంలో ప్రీ రిలీజ్ వేడుకను హైదరాబాద్ నిర్వహించారు. కార్యక్రమానికి అతిధిగి హాజరైన దర్శకుడు వివి వినాయక్ మాట్లాడుతూ -శ్రీవిష్ణు మంచి కథలు ఎంపిక చెసుకుంటున్నాడు. ఈమధ్యే బ్రోచేవారెవరురా చిత్రంతో ఆకట్టుకున్నాడు. తిప్పరా మీసం పోస్టర్, ట్రైలర్ బాగున్నాయి. సినిమా విజయం సాధించాలని ఆకాంక్షిస్తున్నా అన్నారు. హీరో నారా రోహిత్ మాట్లాడుతూ -సినిమా చూశా, బావుంది. హిట్ ఖాయం. ఈ సినిమా తర్వాత విజయ్ పెద్ద దర్శకుడు అవుతాడు అన్నారు. హీరో శ్రీవిష్ణు మాట్లాడుతూ -మాస్ టైటిల్ సినిమాకు మాస్ డైరెక్టర్ వినాయక్ గెస్ట్‌గా రావడం హ్యాపీ. దర్శకుడు విజయ్ నెగెటివ్ క్యారెక్టర్ డిజైన్ చేశాడు. ప్రపంచంలో ఏదైనా మారొచ్చేమోగాని అమ్మ ప్రేమ ఎప్పటికీ మారదు. అలాంటి మదర్ సెంటిమెంట్‌తో చేసిన సినిమా అందరికీ నచ్చుతుంది. ఈ సినిమాను అమ్మలకే అంకితమిస్తున్నా అన్నాడు. దర్శకుడు కృష్ణ విజయ్ ఎల్ మాట్లాడుతూ -ఫ్రెండ్సంతా కలిసి చేసిన సినిమా. శ్రీవిష్ణు క్యారెక్టర్‌కి ఎంత ఇంపార్టెన్స్ వుందో రోహిణి పాత్రకీ అంతే ప్రాముఖ్యత ఉంది అన్నారు. నిర్మాత యంఎల్ కుమార్‌చౌదరి మాట్లాడుతూ -టైటిల్ బావుంది. శ్రీవిష్ణు సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తున్నాడు. త్వరలో మా అమ్మాయి, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ కలిసి శ్రీవిష్ణుతో సినిమా చేయబోతున్నాం అన్నారు. నటి రోహిణి మాట్లాడుతూ -నా పాత్రను కొత్తగా డిజైన్ చేశారు. ప్రతి ఒక్కరికీ సినిమా నచ్చుతుంది అన్నారు. నిర్మాత రిజ్వాన్ మాట్లాడుతూ -విజయ్ ది బెస్ట్ మూవీ ఇచ్చాడు. ప్రాజెక్టు విషయంలో హ్యాపీగా ఉన్నాం. శ్రీవిష్ణు కష్టపడి చేశాడు అన్నారు.