ఆనంద.. అల’కనంద

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అల.. వైకుంఠపురములో చిరునవ్వుల అలకనంద లుక్కిది. తెలుగు, తమిళ, హిందీ భాషల్లో కథానాయికగా ఒకప్పటి టబు క్రేజ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. టాప్ హీరోలతో ప్రాధాన్యత కలిగిన పాత్రలు చేసిన టబు, నాయిక ప్రాధాన్యతా చిత్రాల్లోనూ ఓ మెరుపు మెరిపించింది. హీరోయిన్‌గా అవకాశాలు తగ్గిన తరువాత -వయసుకు తగిన పాత్రలతో కెరీర్ కొనసాగిస్తోంది. కొంత గ్యాప్ తరువాత -అల.. వైకుంఠపురములో చిత్రంతో మళ్లీ ఎంట్రీ ఇస్తోన్న టబు శ్రీమంతురాలు అలకనందా దేవి పాత్ర పోషిస్తోంది. ఆమె పుట్టిన రోజు సందర్భంగా అల వైకుంఠపురంలో టీమ్ శుభాకాంక్షలు చెబుతూ -చిరునవ్వులు చిందిస్తోన్న అలకనంద లుక్ విడుదల చేసింది. త్రివిక్రమ్ దర్శకత్వంలో అల్లు అర్జున్- పూజాహెగ్డే జోడీగా తెరకెక్కుతోన్న సినిమా -అల.. వైకుంఠపురములో. సినిమాలో ఆమె పాత్ర చాలా పవర్‌ఫుల్‌గా ఉండనుందన్నది చిత్రబృందం మాట. తమన్ సంగీతం సమకూరుస్తోన్న సినిమా సంక్రాంతికి థియేటర్లకు రానుండటం తెలిసిందే.