అప్పన్న సాక్షిగా..?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సోషల్ మెసేజ్ చుట్టూ పనునైన కథనల్లుకోవడంలో దర్శకుడు కొరటాల శివ దిట్ట. సూటిగా ఆడియన్స్ గుండెల్ని తాకే అంశాన్ని తీసుకుని.. దానిచుట్టూ కమర్షియల్ ఎలిమెంట్స్‌తో కోటగట్టి సినిమాను ఓ రేంజ్‌లో చూపించగలడు. సినిమా రైటర్‌గానూ, మెగాఫోన్ పట్టిన డైరెక్టర్‌గానూ కొరటాల రైటింగ్స్‌లో స్టైల్ మాత్రం కామన్. మిర్చి, శ్రీమంతుడు, జనతాగ్యారేజ్, భరత్ అను నేను.. చిత్రాల్లో ఒక్కో తరహా సోషల్ మెసేజ్‌తో ఆకట్టుకున్న కొరటాల -తాజాగా చిరంజీవిని ఎలాంటి కథలో చూపించనున్నాడన్న ఆసక్తి ఇండస్ట్రీలో ఉండటం సహజమే. చిరు -కొరటాల కాంబోలో కొద్దిరోజుల క్రితమే ఓ ప్రాజెక్టు లాంఛనంగా మొదలైంది. ప్రీ ప్రొడక్షన్స్ అన్నీ పూర్తవ్వడంతో త్వరలోనే సెట్స్‌పైకి వెళ్లనున్నారని తెలుస్తోంది. రామ్‌చరణ్, మ్యాటినీ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా నిర్మిస్తోన్న ప్రాజెక్టులో -కొరటాల చెప్పబోయే కథపై లీకులు మొదలయ్యాయి. ఇదిలావుంటే -పురాతన దేవాలయాల బ్యాక్‌డ్రాప్‌లో కొరటాల తన కథను డిజైన్ చేశాడన్నది కొంతకాలంగా వినిపిస్తోన్న మాట. తాజా సమాచారం ప్రకారం -సింహాచలం అప్పన్న దేవాలయం నేపథ్యంగా అల్లుకున్న కథలో చిరంజీవిని చూపించే అవకాశం ఉందని అంటున్నారు. చాలా ఏళ్ల కిందట సింహాచలం అప్పన్న దేవాలయ పరగణాల్లో చోటుచేసుకున్న ఓ నిజ సంఘటన చుట్టూ కథ అల్లుకున్నట్టు తెలుస్తోంది. పైగా దేవాలయ భూముల సమస్య ఆధారంగా కథ ఉండొచ్చన్న అంచనాలూ లేకపోలేదు. ఏదేమైనా సింహాచలం టెంపుల్ బ్యాక్‌డ్రాప్‌లో అల్లుకున్న కథ అన్నదే ఆసక్తికరం. అలాంటి కథతో చిరు-శివ ఎలాంటి మ్యాజిక్ షో చూపిస్తారో, ఎంతటి ఉదాత్తమైన సందేశమిస్తారో చూడాలి.