పవన్ అతిథిగా అ..ఆ ఆడియో

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నితిన్, సమంత జంటగా హారిక అండ్ హాసిని క్రియేషన్స్ పతాకంపై త్రివిక్రమ్ దర్శకత్వంలో సూర్యదేవర రాధాకృష్ణ రూపొందిస్తున్న చిత్రం ‘అ.. ఆ’. ఈ చిత్రానికి సంబంధించిన ఆడియో విడుదల కార్యక్రమం ఈ నెల 2న హైదరాబాద్‌లో జరగనుంది. ఈ కార్యక్రమానికి పవన్‌కళ్యాణ్ ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారు. ఈ సందర్భంగా సూర్యదేవర రాధాకృష్ణ మాట్లాడుతూ, మిక్కి జె మేయర్ అందించిన సంగీతం ప్రేక్షకులకు నచ్చుతుందని, ప్రస్తుతం సినిమా నిర్మాణానంతర కార్యక్రమాలు జరుపుకుంటోందని, ఈనెలలోనే విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నామని తెలిపారు. త్రివిక్రమ్ దర్శకత్వంలో తొలిసారిగా నితిన్ నటిస్తున్న ఈ చిత్రంలో సమంతతోపాటుగా అనుపమా పరమేశ్వరన్ కూడా నటిస్తున్నారని ఆయన అన్నారు. నదియా, అనన్య, ఈశ్వరీరావు, సన, గిరిబాబు, నరేష్, రావూ రమేష్, పోసాని, అవసరాల శ్రీనివాస్, రఘుబాబు, ప్రవీణ్, శ్రీనివాసరెడ్డి తదితరులు నటిస్తున్న ఈ చిత్రానికి కెమెరా:నటరాజ్ సుబ్రమణియన్, ఆర్ట్:ఎ.ఎస్.ప్రకాష్, ఎడిటింగ్:కోటగిరి వెంకటేశ్వరరావు, కథ, మాటలు, స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: త్రివిక్రమ్.