బాకూ లొకేషన్స్‌లో..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆర్‌ఎక్స్ 100 ఫేమ్ కార్తికేయ తాజాగా నటిస్తున్న చిత్రం 90 ఎంఎల్. నేహా సోలంకి కథానాయికగా నటిస్తున్న ఈ సినిమాను కార్తికేయ క్రియేటివ్ వర్క్స్ పతాకంపై అశోక్ రెడ్డి గుమ్మకొండ, శేఖర్‌రెడ్డి ఎర్ర దర్శకత్వంలో రూపొందిస్తున్నారు. చిత్రానికి సంబంధించిన షూటింగ్ ఇటీవల అజర్‌బైజాన్‌లో మూడు పాటల చిత్రీకరణ జరిపారు. దీంతో షూటింగ్ మొత్తం పూర్తయింది. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నామని, త్వరలో విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు. అజర్‌బైజాన్ రాజధాని బాకూలో అందమైన ప్రాంతాలలో ఈ చిత్రంలో పాటలను చిత్రీకరించామని, సిజి వౌంటెన్స్, కాస్పియన్ సముద్రం వద్ద ఐదు రోజులపాటు చేసిన పాటలు సినిమాకు హైలెట్‌గా వుంటాయని, వెళ్లిపోతుందే వెళ్లిపోతుందే, సింగిల్ సింగిల్ పాటలు ప్రేక్షకులకు క్యాచ్‌బుల్‌గా వుంటాయని ఆయన తెలిపారు. ఈ చిత్రానికి దర్శకత్వం: శేఖర్‌రెడ్డి ఎర్ర.