ఐదేళ్ల హీరో జర్నీ.. తిప్పరా మీసం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కథానాయకుడు ఓ పబ్‌లో డిజె. అందరూ అతన్ని డిజె మణి అంటారు. మనందరం ఉదయానే్న లేచి మన పనులు చేసుకుంటే అతను మాత్రం రాత్రిళ్లు నిద్రలేచి తన కార్యక్రమాలు చేస్తుంటాడు. నెగెటివ్ టచెస్‌తో సాగే సినిమా తిప్పరా మీసం అంటున్నాడు దర్శకుడు విజయ్ కృష్ణ. శ్రీవిష్ణు, నిక్కీ తంబోలి జంటగా రిజ్వాన్ ఎంటర్‌టైన్‌మెంట్స్, కృష్ణవిజయ్ ప్రొడక్షన్స్ పతాకాలపై నిర్మాత రిజ్వాన్ రూపొందించిన చిత్రమిది. ఈనెల 8న విడుదలవుతున్న సందర్భంగా దర్శకుడు విజయ్ కృష్ణ మీడియాతో మాట్లాడాడు. -స్ట్రాంగ్ ఎమోషన్ యాక్షన్ డ్రామాగా చిత్రాన్ని రూపొందించాం.
క్రికెట్‌లో పాక్‌పై ఇండియా గెలిస్తే ఎలా వుంటుంది? సరిహద్దులలో ఆర్మీ సాధించిన విజయానందం ఎలా వుంటుంది? అలాంటి అద్భుతమైన మూమెంట్స్ ఓ సామాన్య కుర్రాడింట్లో ఉంటే ఎలా వుంటుందనే కథనంతో సినిమా సాగుతుందన్నారు. ప్రతి ఇంట్లో ఓ కుర్రాడికి కొన్ని అందమైన మూమెంట్స్ వుంటాయి. ఆ మూమెంట్స్‌ను బేస్ చేసుకుని మదర్ సెంటిమెంట్‌తో కథ రాసుకున్నట్టు చెప్పారు. శ్రీవిష్ణుతో ఎప్పటినుంచో పరిచయం వుందని, తాను చేసిన అసురలో ఒక పాటలో నటించాడన్నారు. బేసిగ్గా ఇద్దరం స్నేహితులం అవ్వడంవల్ల ఓ ప్రాజెక్టు చేయాలనుకున్నాం. ఇప్పటిదాకా ఎమోషన్ కథలతో చేశాం కనుక, అలాంటిదే మరొకటి చేయాలనుకున్నాం. అందులో నాదగ్గర వున్న కథల్లో ఈ కథ ఒకటి వుండడంతో ఈ సినిమా రూపొందించాం. ఓ పబ్‌లో డిజెగా వున్న అతను సాయంత్రాలలో అతను ఏం చేస్తాడు? నెట్‌వర్క్ రెగ్యులర్ ఎలా వుంటుంది? కొద్దిగా నెగెటివ్ థాట్స్‌తో సాగే ఆ పాత్ర అతని మైండ్ సెట్ సైకాలజీ డిఫరెంట్‌గా వుండేలా ఈ పాత్రను తీర్చిదిద్దాం. మన చుట్టూ జరుగుతున్న కొన్ని చిన్న చిన్న సంఘటనల సమాహారమే ఈ చిత్రకథను రాసుకున్నాను. ఐదేళ్ల హీరో ప్రయాణమే ఈ కథ. ఇద్దరు విలన్లు వుంటారు. హీరో డిజె కనుక రాత్రి షూటింగ్ ఎక్కువ చేయాల్సి వచ్చింది. కన్నడలో కూడా ఈ చిత్రాన్ని విడుదల చేస్తున్నాం. సంగీతం సురేష్ బొబ్బిలి ఐదు పాటలు ఇచ్చారు. అందులో మూడు పాటలు సినిమాలో వుంటే, ఒకటి బ్యాక్‌గ్రౌండ్‌గా, మరొకటి ప్రమోషనల్ సాంగ్‌గా వస్తాయి. నిక్కీ పాత్ర పేరు వౌని. ఆమె పాత్ర కూడా కథను ముందుకు తీసుకెళ్లేలా వుంటుంది. ఇద్దరిమధ్య ఓ నైస్ లవ్‌స్టోరీ కూడా వుంటుంది. దర్శకత్వం అనేది ఏ రోజుకారోజు ఓ ఛాలెంజ్ లాంటిది. నిర్మాత బడ్జెట్ చూసుకుంటే చాలు. కనుక దర్శకత్వ బాధ్యతలు చాలా టఫ్ జాబ్ అని నా ఉద్దేశ్యం. అసుర థ్రిల్లర్‌గా రూపొందిస్తే, ఈ చిత్రాన్ని యాక్షన్ డ్రామాగా చేశాం. అందరికీ నచ్చుతుందనుకుంటాను అన్నారు విజయ్ కృష్ణ.