కళ్లలోకి కళ్లుపెట్టి..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నువ్వునా ముందుంటే/ నిన్నలా చూస్తుంటే/ జివ్వుమంటోంది మనసు/ రివ్వుమంటుంది వయసు -అన్నాడు అప్పుడెప్పుడో గూఢచారి 116 సినిమాలో హీరో కృష్ణ. ఇక్కడ నితిన్ ఏమన్నాడోగానీ -రష్మిక సిగ్గు మాత్రం బుగ్గన ఎగబాకి కళ్లలో నవ్వైంది. నితిన్ -రష్మిక కళ్లలో కళ్లుపెట్టి చూసుకుంటున్నది భీష్మ సినిమా కోసం. దర్శకుడు వెంకీ కుడుముల సెకెండ్ మూవీలో ఫస్ట్‌టైం జోడీకట్టిన ఇద్దరూ అద్భుతమైన రొమాన్స్ చూపించనున్నారట. మ్యూజికల్ రొమాంటిక్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న సినిమా నుంచి దీపావళి సందర్భంగా వదలిన ఫస్ట్‌లుక్ మెరుపు మెరిపించటం తెలిసిందే. గురువారం మరో ‘అద్భుతాన్ని’ చూపిస్తామంటోంది చిత్రబృందం. చూద్దాం -అదెలావుంటుందో.