వెంకీమామ లెక్కే వేరు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

సంక్రాంతి రేసులో ఉండాలా? వద్దా అన్న సందిగ్ధం నుంచి ‘వెంకీమామ’ టీం బయటికొచ్చేసింది. డిసెంబర్ 20న తెలుగు సినిమాలు డిస్కోరాజా, ప్రతిరోజూ పండగే, హిందీ సినిమా దబాంగ్ 3 థియేటర్లకు వస్తున్నాయి. బాలకృష్ణ రూలర్ సైతం అదే రోజు థియేటర్లకు వచ్చే అవకాశం లేకపోలేదు. ఈ నేపథ్యంలో డిసెంబర్ 13నే ‘వెంకీమామ’ థియేటర్లకు రావొచ్చంటూ సాగిన ప్రచారాలనూ టీం పక్కనపెట్టేసింది. క్రిస్మస్ హాలిడేస్‌ను దృష్టిలో పెట్టుకుని డిసెంబర్ 25న సినిమాను థియేటర్లకు తెచ్చేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్టు అప్‌డేట్ సమాచారం. ఆరోజు పబ్లిక్ హాలిడే. పైగా ముందు రోజు మంగళవారం రావడంతో యుఎస్‌లో ప్రీమియర్లు వేసుకునే సౌలభ్యముంది. డిసెంబర్ లాస్ట్ వీక్ నుంచి న్యూ ఇయర్ ఫస్ట్‌వీక్ వరకూ ఉండే హాలిడే మూడ్ సినిమాకు కలిసొచ్చేదే. డిసెంబర్ 20న విడుదలవుతున్న సినిమాల హడావుడి అప్పటికి పల్చబడితే --వెంకీమామకి క్రిస్మస్ డేట్ పర్ఫెక్ట్ రిలీజింగ్ అన్న అంచనాలూ లేకపోలేదు. పైగా డిసెంబర్ 20న వచ్చే సినిమాలకి హాలీవుడ్, బాలీవుడ్ చిత్రాల తాకిడీ ఉంది. సో, డిసెంబర్ 25న తీరిగ్గా వస్తే మంచి థియేటర్లతోపాటు, మంగళవారం యుఎస్ ప్రీమియర్లకీ ఆఫర్లు ఉంటాయని భావిస్తున్నారు. సంక్రాంతి రేసులో పెద్ద సినిమాలతో పోటీపడటంకంటే, క్రిస్మస్‌కు మల్టీస్టారర్ మూవీ అన్న స్పెషల్ అట్రాక్షన్‌ను క్యాష్ చేసుకోవడం బెటరన్న ఆలోచన సురేష్‌బాబు చేస్తున్నట్టు తెలుస్తోంది. డిస్ట్రిబ్యూషన్ సర్కిల్స్‌లో ఈ డేట్‌పై చర్చ మొదలైంది. సంక్రాంతి రేసు సినిమాలు ఎలాగూ ఫిక్సైపోయాయి. సో, తరువాత వచ్చే వేసవి సీజన్‌కూ ఇప్పటినుంచే ప్రణాళికలు సిద్ధమవుతున్నాయి. వాటిలో ప్రధానంగా ఇస్మార్ట్ హిట్టు కొట్టివున్న రామ్ ‘రెడ్’, వైవిధ్యమైన సినిమాలతో దూసుకుపోతున్న నాని ‘వి’ చిత్రాలపై ఆడియన్స్‌కి ఆసక్తి లేకపోలేదు. సమ్మర్ సీజన్‌లో ముందొచ్చే సినిమాలకు కలెక్షన్లు కలిసొస్తాయన్న సెంటిమెంట్ ఎప్పటినుంచో ఉంది. అందుకే సీజన్ ఆరంభంలోనే సినిమాను థియేటర్లకు తెచ్చే ఉద్దేశంతో రామ్ ‘రెడ్’ కోసం ఏప్రిల్ 9 డేట్ ఫిక్స్ చేసుకున్నారు. గుడ్ ఫ్రైడేతో పాటు వేసవి సెలవులు కలిసొస్తాయన్నది ‘రెడ్’ టీం స్కెచ్. అయితే సీజన్‌ను ముందుగానే అందిపుచ్చుకోడానికి -నాని, సుధీర్‌బాబు సినిమా ముందే వచ్చేస్తోంది. క్లాస్ చిత్రాలు చేసుకుంటూ వచ్చిన దర్శకుడు ఇంద్రగంటి మోహన కృష్ణ తొలిసారి యాక్షన్ ‘వి’ చేస్తూ -మార్చి 25న ఉగాది కానుకగా సినిమా విడుదల చేస్తున్నట్టు ప్రకటించారు. సో, ఫస్ట్ కమర్‌గా ‘వి’ చిత్రానికి సమ్మర్ ఓపెనింగ్స్ బావుంటాయన్న అంచనాలు వినిపిస్తున్నాయి. పైగా నాని నెగెటివ్ షేడ్స్‌వున్న పాత్ర పోషిస్తుండటంతో, లోడెడ్ యాక్షన్ సీక్వెన్స్‌లు ఉంటాయని చిత్రబృందం చెబుతుండటంతో ‘వి’పై అంచనాలు పెరుగుతున్నాయి. ఫైనల్‌గా సినిమాకు ఫినిషింగ్ టచ్ రిలీజ్ డేటే కనుక -ఏ శ్లాట్‌లో ఎంత ఉపయోగం ఉండొచ్చన్న లెక్కలతో ఈ ఏడాది లాస్ట్ క్వార్టర్, వచ్చే ఏడాది ఫస్ట్ క్వార్టర్ చిత్రాలు లెక్కలేసుకుని మరీ వస్తున్నాయి.