సాయే దైవం డబ్బింగ్ పూర్తి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

జి.ఎల్.బి. మూవీస్ మేకర్స్ పతాకంపై శ్రీనివాస్.జి.ఎల్.బి. స్వీయ దర్శకత్వంలో రూపొందిస్తున్న చిత్రం ‘సాయే దైవం’. ఈ చిత్రానికి సంబంధించిన డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తిచేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ, షిరిడీ సాయిబాబా భక్తుల అనుభవాలను ప్రధానాంశంగా తీసుకొని రూపొందించిన ఈ చిత్రంలో భక్తుల జీవితాలలో జరిగిన అనుభవాలు వుంటాయని తెలిపారు. పాటల చిత్రీకరణ ప్రారంభించామని, రెండు తెలుగు రాష్ట్రాల్లో వున్న బాబా ఆలయాల్లో షూటింగ్ జరపనున్నామని తెలిపారు. త్వరలోనే ఆడియోను విడుదల చేస్తామని ఆయన అన్నారు. చంద్రమోహన్, కోట శ్రీనివాసరావు, రావు రమేష్, ఎల్.బి.శ్రీరాం, ధన్‌రాజ్, శంకరాభరణం రాజ్యలక్ష్మి, సుదీపా తదితరులు నటించిన ఈ చిత్రానికి పాటలు: బిక్కి కృష్ణ, సంగీతం: పోలూర్ ఘటికాచలం, కథ, స్క్రీన్‌ప్లే, నిర్మాత, దర్శకత్వం: శ్రీనివాస్.జి.ఎల్.బి.