ఒక్క అమ్మాయి తప్ప..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నిత్యామీనన్, సందీప్ కిషన్ జంటగా తాడినాడ రాజాసింహ దర్శకత్వంలో బోగాది అంజిరెడ్డి రూపొందిస్తున్న చిత్రం ‘ఒక్క అమ్మాయి తప్ప’. ఈ చిత్రానికి సంబంధించిన పోస్ట్‌ప్రొడక్షన్ కార్యక్రమాలు జరుపుతున్నారు. ఈ సందర్భంగా నిర్మాత మాట్లాడుతూ.. టాకీపార్టు పూర్తిచేశామని, పాటల చిత్రీకరణ కూడా జరుపుతున్నామని, ఓ వైవిధ్యమైన నేపథ్యంలో నడిచే కమర్షియల్ ఎంటర్‌టైనర్‌గా సినిమాను తీర్చిదిద్దామని తెలిపారు. ఆల్ ఇండియన్స్ ఆర్ మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అన్న క్యాప్షన్‌తో రూపొందుతున్న ఈ చిత్రంలో కథానాయకుడు ‘ఒక్క అమ్మాయి మాత్రం అలా కాదని’ చెప్పడమే ఈ సినిమాలో సాగే ప్రధానమైన కథ అని తెలిపారు. నిత్యామీనన్ ఈ పాత్రకు తగిన విధంగా నటించిందని, హిందీ నటుడు రవికిషన్ విలన్‌గా నటించారని, గంట ముప్పయి నిమిషాలపాటు గ్రాఫిక్స్ ప్రేక్షకులను ఆకట్టుకుంటాయని అన్నారు. మంచి ఫీల్‌తో రూపొందించిన ఈ చిత్రం లవ్ ఎంటర్‌టైనర్‌గా అందరికీ నచ్చుతుందని, త్వరలో ప్రేక్షకుల ముందుకు రావడానికి సన్నాహాలు చేస్తున్నామని దర్శకుడు తెలిపారు. అలీ, అజయ్, బ్రహ్మాజీ, తనికెళ్ల భరణి, రావురమేష్, రాహుల్‌దేవ్, పృథ్వి, సప్తగిరి, తా.రమేష్, నళిని, జ్యోతి, రేవతి తదితరులు నటించిన ఈ చిత్రానికి కెమెరా: చోటా కె.నాయుడు, సంగీతం: మిక్కీజె.మేయర్, ఎడిటింగ్: గౌతంరాజ్, నిర్మాత: బోగాది అంజిరెడ్డి, కథ, మాటలు,స్క్రీన్‌ప్లే, దర్శకత్వం: రాజాసింహ తాడినాడ.