జాతీయ వార్తలు

చోక్సీ పౌరసత్వ రద్దుకు నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: వేలకోట్ల రూపాయల పంజాబ్ నేషనల్ బ్యాంక్ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న వజ్రాల వ్యాపారి చోక్సీకి ఎదురుదెబ్బ తగిలింది. అతని పౌరసత్వాన్ని రద్దు చేయాలని అంటిగ్వా ప్రభుత్వ నిర్ణయం తీసుకుంది. పంజాబ్‌ నేషనల్‌ బ్యాంక్‌ కుంభకోణంలోనకిలీ పత్రాలతో రుణాలు పొంది రూ 14,000 కోట్లకు పైగా పీఎన్‌బీ స్కామ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటున్న చోక్సీ పౌరసత్వాన్ని రద్దు చేయాలని అంటిగ్వా ప్రభుత్వం నిర్ణయించింది. చోక్సీ పౌరసత్వంపై విచారణ చేపట్టామని, ఆయన పౌరసత్వాన్ని రద్దు చేసి భారత్‌కు అప్పగించే ప్రక్రియ చేపడతామని అంటిగ్వా ప్రధాని గాస్టన్‌ బ్రౌన్‌ ఓ ప్రకటనలో వెల్లడించారు. ఆర్థిక నేరాల్లో పాలుపంచుకున్న నేరగాళ్లకు అంటిగ్వాను సురక్షిత ప్రదేశంగా మార్చే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు.