చిత్తూరు

భానుడి భగభగ...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 19: వాతావరణ శాఖ ముందుగా చెప్పినట్లు గురువారం నాడు భానుడు తన ప్రతాపాన్ని చూపాడు. 41 డిగ్రీల మేర ఉష్ణోగ్రత నమోదు కావడంతో జనం విలవిలలాడారు. ఉదయం నుండే సూర్యుడు తన ప్రతాపాన్ని చాటుకున్నాడు. అయితే సాయంత్రానికి కొంత చల్లబడినా ఉష్ణతాపం మాత్రం తగ్గకపోవడంతో పిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. రోడ్లపైకి రావడానికి కూడా ప్రజలు సాహసించలేని పరిస్థితి ఏర్పడింది. విధి లేని పరిస్థితుల్లో రోడ్లపైకి వచ్చిన వారందరూ కూడా ఎక్కడ పండ్ల రసాల దుకాణాల ఉన్నాయో అక్కడ చేరి తమ గొంతు తడుపుకున్నారు. తారురోడ్లపైన ఎండమావులు దర్శనమిస్తుండంతో ప్రజలు, వాహన చోదకులు అల్లాడిపోతున్నారు. భానుడి భగభగలకు తట్టుకోలేక ప్రజలు ఏసీలు, చెట్ల నీడన సేద తీరుతున్నారు. చల్లని పానీయాలు సేవిస్తూ కొంతమేరకు ఊరట పొందుతున్నారు. ఎండ వేడిమికి తట్టుకోలేక వృద్ధులు, చిన్నారులు అనారోగ్యం పాలవుతున్నారు. ఎండలు మండుతుండటంతో కొబ్బరి బోండాలు, దోసకాయలు, కర్భూజకాయలు, సపోట వంటి వాటికి భలే గిరాకీ ఏర్పడింది. పశువులు, పక్షులు ఎండలకు తట్టుకోలేక ఇబ్బందులు పాలవుతున్నాయి.