చిత్తూరు

ప్రధాని మోదీ మాట నిలబెట్టుకుని ఉంటే.. ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 19: రాష్ట్ర విభజన నేపథ్యంలో ఎన్నికల ముందు తిరుమల వెంకన్న సాక్షిగా ప్రధాని నరేంద్రమోదీ ఇచ్చిన మాట ప్రకారం విభజన చట్టంలోని హామీలను నెరవేర్చి ప్రత్యేక హోదాను ఇచ్చి ఉంటే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలకు మరిన్ని సంక్షేమ పథకాలను అందించి ఉండేవారని, రాష్ట్రాన్ని మరింత త్వరితగతిన అభివృద్ధి చేసి ఉండేవారని రాష్ట్ర భారీ పరిశ్రమల శాఖామంత్రి అమరనాథ్ రెడ్డి పేర్కొన్నారు. విభజన చట్టంలోని హామీలు అమలు-రాష్ట్రానికి ప్రత్యేక హోదా అమలుపై కేంద్రంపై దశలవారీ పోరాటాలను చేస్తున్న విషయం విధితమే. ఈ క్రమంలో శుక్రవారం తన జన్మదినాన్ని పురస్కరించుకుని ముఖ్యమంత్రి అమరావతిలో ధర్మ పోరాట వౌన దీక్షను చేపడుతున్న విషయం విధితమే. ఈనెల 30వ తేదీన ప్రభుత్వం తిరుపతిలోని ఎస్వీయూ తారకరామా క్రీడామైదానంలో అధికారికంగా చేపట్టనున్న భహిరంగ సభలో కూడా సీఎం పాల్గొననున్నారు. ఈ సభకు జిల్లా వ్యాప్తంగా దాదాపు 70వేల మందికి పైగా ప్రజలను హాజరుపరచడానికి టీడీపీ నేతలు సన్నాహాలు చేస్తున్నారు. ఈ సభను విజయవంతం చేసేందుకు చేపట్టాల్సిన సన్నాహక ఏర్పాట్లపై మంత్రి అమరనాథ్ రెడ్డి నేతృత్వంలో స్థానిక ఆర్ అండ్ బి అతిథిగృహంలో జిల్లా టీడీపీ నేతల సమన్వయ సమావేశం గురువారం జరిగింది. అనంతరం మంత్రి విలేఖరులతో మాట్లాడుతూ ప్రధాని నరేంద్రమోదీ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇస్తానని ఏడు కొండల వాడి సాక్షిగా చెప్పిన విషయం ప్రపంచానికి తెలుసన్నారు. అయితే ఆ విషయాన్ని ఆయన మరిచిపోయారని, ఆ వాస్తవాన్ని ప్రధానికి గుర్తు చేయడంతోపాటు రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని ప్రజలకు తెలియజేసి ప్రత్యేక హోదా సాధనలో భాగస్వాములను చేయడమే తిరుపతి సభ ప్రధాన సంకల్పమన్నారు. ఈ సభను విజయవంతం చేయడానికి రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ తరలిరావాలని, అలాగే విద్యార్థులు, ప్రజాసంఘాలు, ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘాలు సభలో పాల్గొని తెలుగు ప్రజల ఆకాంక్షను ఢిల్లీకి తెలియజేయాలని పిలుపునిచ్చారు. దేశ చరిత్రలోనే తొలిసారిగా రాష్ట్ర, ప్రజల ప్రయోజనాల కోసం ధర్మ పోరాట వౌన దీక్ష చేపట్టిన ఘనత చంద్రబాబు నాయుడుదేనన్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను కూడా చైతన్య పరిచేందుకు ఈనెల 21వ తేదీ నుంచి టీడీపీ నాయకులు, కార్యకర్తలు సైకిల్ యాత్రలు నిర్వహించి రాష్ట్రానికి జరిగిన అన్యాయాన్ని తెలియజేసే కార్యక్రమం చేపడుతున్నామన్నారు. కేంద్రం రాష్ట్రానికి అందించాల్సిన సాయాన్ని అందించకున్నా, సీఎం చంద్రబాబు నాయుడు ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్భ్రావృద్ధిని ఎంతో చాకచక్యంగా అమలు చేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే పోలవరం, రుణాల మాఫీ, గ్రామీణ ప్రాంతాల్లో వౌళిక సదుపాయాలు, రాజధాని నిర్మాణాన్ని ఎంతో జాగ్రత్తగా సీఎం అమలు చేస్తున్నారని అన్నారు. ఈక్రమంలో ప్రజలు అభద్రతాభావానికి గురికావాల్సిన అవసరం లేదని, రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి జిల్లాలో జరుగనున్న సభల ద్వారా సీఎం తెలియజేస్తారని మంత్రి స్పష్టం చేశారు. కేంద్రం సహకరించి ఉంటే మరిన్ని ప్రజా సంక్షేమ కార్యక్రమాలను, రాష్ట్రాన్ని మరింత త్వరితగతిన అభివృద్ధి చేయడానికి మార్గం సుగమం అయ్యేదని ఒక ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ప్రత్యేక హోదా సాధన, రాష్ట్ర ప్రయోజనాల పరిరక్షణకు తమ ప్రభుత్వం చేపడుతున్న ఉద్యమాలు ప్రజలకు ఏమాత్రం అసౌకర్యం కలగకండా చేయాలన్నదే సీఎం సంకల్పమని తెలిపారు. విపక్షాలు ఉద్యమాలు చేస్తే అణచివేసే ప్రభుత్వం ప్రత్యేక హోదా విషయంలో విపక్షాలకు స్వేచ్ఛ ఇవ్వడంపై అడిగిన ప్రశ్నకు ప్రభుత్వం ఉద్యమాలను ఏనాడు అణచివేయలేదన్నారు. అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడవద్దని మాత్రమే తాము విపక్షాలకు తెలియజేస్తున్నామన్నారు. ఉద్యమం ముసుగులో ప్రజలను భయభ్రాంతులకు గురిచేసే అసాంఘిక కార్యక్రమాలు చేపడితే ఎలా ఊరుకుంటామని మంత్రి అన్నారు. తిరుపతి, పుంగనూరు ప్రాంతాల్లో ద్విచక్ర వాహనాలు దగ్ధం చేయడాన్ని మంత్రి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఒక్కరోజు సీఎం చేసే దీక్షతో ఒరిగేదేమీ లేదని విపక్షాలు అంటున్నాయన్న ప్రశ్నకు మంత్రి అమరనాథ్ రెడ్డి స్పందిస్తూ ప్రత్యేక హోదా ఇచ్చేంత వరకు దశలవారీ పోరాటం సాగుతూనే ఉంటుందన్నారు. ఎవరు ఎప్పుడు చేశారనేది ప్రశ్న కాదని, ఒక్కరోజు చేసినా, వందరోజులు చేసినా ‘బుల్లెట్ దిగిందా.. లేదా’ అనేదే ముఖ్యమన్నారు. సీఎం చేపట్టే కార్యక్రమం ఇటు కేంద్రానికి కళ్లు తెరిపించడంతోపాటు ప్రజలను చైతన్య పరుస్తుందనడంలో సందేహం లేదన్నారు. ఢిల్లీలో కూడా పోరాటం చేస్తామని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. ఉద్యమాలు ఎలా జరపాలన్నది ముఖ్యమంత్రికి ఒకరు చెప్పాల్సిన అవసరం లేదని, తమ పార్టీకి ఒక విధివిధానాలు ఉంటాయని మరో ప్రశ్నకు సమాధానంగా చెప్పారు. తమకు ప్రజలు, రాష్ట్ర ప్రయోజనాలే ముఖ్యం తప్ప స్వార్థ ప్రయోజనాలు కావని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చేస్తున్న ధర్మపోరాటానికి ప్రజలంతా అండగా నిలవాలని ఆయన మరోమారు ఉద్ఘాటించారు. ఈసమావేశంలో జిల్లా ఇన్చార్జ్, ఎమ్మెల్సీ పి.సునీత, ఎమ్మెల్యేలు సుగుణమ్మ, ఆదిత్య, ఎమ్మెల్సీ దొరబాబు, తుడా చైర్మన్ నరసింహయాదవ్, జడ్పీ చైర్‌పర్సన్ గీర్వాణి చంద్రప్రకాష్, టీడీపీ జిల్లా అధ్యక్షుడు పులివర్తి నాని, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి డాక్టర్ సుధారాణి, తెలుగు యువత జిల్లా అధ్యక్షుడు శ్రీ్ధర్‌వర్మ, టీడీపీ నగర అధ్యక్షుడు దంపూరి భాస్కర్ యాదవ్ పాల్గొన్నారు. అంతకుమునుపు జరిగిన టీడీపీ నాయకుల సమన్వయ కమిటీ సమావేశంలో ఎమ్మెల్సీ గౌనివారి శ్రీనివాసులు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి నీలం బాలాజీ, కార్యనిర్వాహక కార్యదర్శి ఇనుకొండ సుబ్రమణ్యం, డాక్టర్ సిపాయి సుబ్రమణ్యం, మాజీ ఎమ్మెల్యే లలితకుమారి, ఆర్టీసీ చిత్తూరు రీజియన్ చైర్మన్ బోసు తదితరులు పాల్గొన్నారు.