క్రైమ్/లీగల్

అంతర్‌రాష్ట్ర దొంగలముఠా ఆరుగురు అరెస్టు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ములకలచెరువు, ఏప్రిల్ 19: రాష్ట్రంలో అనంతపురం, చిత్తూరుజిల్లాలో 22మండలాల్లో 202ట్రాన్స్ ఫార్మర్లను ధ్వంసం చేసి అందులోని విలువైన రాగివైరును అమ్మే ముఠాను గురువారం ములకలచెరువు సీఐ రుషికేశవ అరెస్ట్ చేసిన రిమాండ్‌కు పంపిన సంఘటన జరిగింది. మదనపల్లె డీఎస్పీ తెలిపిన వివరాల మేరకు ఇలా వున్నాయి. గత ఏడాది నుండి జిల్లాలో 22మండలాల్లో పంట పొలాల వద్ద ఉన్న ట్రాన్స్ ఫార్మర్లను పగలగొట్టి అందులోని రాగివైరును తీసుకొని కర్నాటక రాష్ట్రం, చింతామణి, బెంగళూరు తదితర ప్రాంతాల్లో అమ్ముకొని సోమ్ము చేసుకునేవారు. వీరు టైల్‌పుర్లు కరెంట్ తీగలకు కట్టి విద్యుత్ సబ్ కార్యాలయాల్లో కరెంట్ ట్రాప్ కాకుండా చేసి ట్రాన్స్ ఫార్మర్‌ను పగలగొట్టేవారు. వీరు ములకలచెరువు మండలంలోని పెద్దపాళ్యం పెద్దేరు బ్రిడ్జ్ వద్ద బుధవారం అనుమానితులుగా తిరుగుతున్నట్లు సమాచారం రావడంతో సీఐ, ఎస్‌ఐ, సిబ్బందితో వెళ్లి వారిని అదుపులోకి తీసుకొని విచారించగా ఆసలు విషయం బయటపడింది. అరెస్ట్ అయిన వారిలో అనంతపురం జిల్లాకు చెందిన వారు రామాంజులు(50)లు, మంజునాధ్(30)లు, నీరుగట్టు సురేష్(30)లు, కొక్కంటి వెంకటేష్(34)లు, చింతామణికి చెందిన వారు ఖాధర్‌బాషా(56)లు, పర్వీన్ అహ్మద్(41)లపై జిల్లాలోని 46పోలీస్‌స్టేషన్లలో వివిధ కేసులు ఉన్నాయని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐ రుషికేశవ, ఎస్‌ఐ ఈశ్వరయ్య, పోలీస్ సిబ్బంది సీరాజ్, రామచంద్ర, రెడ్డిశేఖర్, నరేష్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు.
సిబ్బందిని అభినందించి రివార్డును అందజేసిన డీఎస్పీ :- ట్రాన్స్ ఫార్మర్ దొంగల ముఠాను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహారించిన పోలీస్ సిబ్బందికి మదనపల్లె డీఎస్పీ చిదానందరెడ్డి అభినందించి రివార్డును అందజేశారు. సీరాజ్, రెడ్డిశేఖర్, రామచంద్ర, నరేష్, వెంకటేష్ తదితరులకు రివార్డులు డీఎస్పీ ఇచ్చారు.