చిత్తూరు

.క్రమశిక్షణతో విధులు నిర్వహించాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చిత్తూరు, ఎప్రిల్ 19: హోమ్ గార్డులుగా ఎంపికైనా వారు తమ విధులను క్రమశిక్షణతో నిర్వహించాలని జిల్లా ఎస్పీ రాజశేఖర్ బాబు తెలిపారు. గురువారం చిత్తూరులోని పోలీసు అతిథి గృహంలో ఇటీవల హోమ్ గార్డులుగా ఎంపికైన సీపీఓలతో జిల్లా ఎస్పీ సమావేశమయ్యారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో సీపీఓ వ్యవస్థ ప్రారంభమై సుమారు రెండు సంవత్సరాలు అయిందని, అప్పటి నుంచి నిజాయతీతో జిల్లా పోలీసు శాఖకు సీపీఓలు సహకరించి , స్వచ్ఛంధంగా తమ సేవలు అందించారన్నారు. హోమ్ గార్డు ఎంపికలో సిపీఓలు వారు పని చేసిన గంటల ఆధారంగా మార్కులు కేటాయించడంతో పాటు, ఈ ఎంపిక పక్రియలో భాగంగా నిర్వహించిన వివిధ సామర్థ్య పరీక్షలను దృష్టిలో ఉంచుకొని ఎంపిక చేసామన్నారు. హోమ్ గార్డులు గా ఎంపికైన సీపీఓలు క్రమశిక్షణతోపాటు నీతి నిజాయతీతో పని చేసి పోలీసు వ్యవస్థకు వనె్న తేవాలన్నారు. జిల్లాలో సీపీఓలు చిత్తూరు సబ్ డివిజన్ నుంచి 17 మంది, మదనపల్లి నుంచి ఏడు గురు, పుత్తూరు నుంచి ఆరు మంది , పలమనేరునుంచి నల్గురు చొప్పున ఎంపిక అయ్యారని , వీరికి త్వరలోనే శిక్షణా తరగతులు నిర్వహిస్తారన్నారు. సీపీఓలుగా విధులు నిర్వహిస్తూ హోమ్ గార్డులుగా ఎంపికైన వారిని జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రంమలో ఏఎస్పీ రాధిక , డీఎస్పీలు సుబ్బారావు, కేశప్ప, ఇతర పోలీసు అధికారులు పాల్గొన్నారు.

ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పనులు త్వరగా పూర్తిచేయాలి
* జిల్లా కలెక్టర్ ఆధికారులకు ఆదేశం
చిత్తూరు, ఏప్రిల్ 19: జిల్లాలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పనులు త్వరగా పూర్తి అయ్యే విధంగా అధికారులు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రద్యుమ్న ఆదేశించారు. గురువారం చిత్తూరులోని జిల్లా సచివాలయంలో ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై అధికారులతో సమీక్షించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ కింద మంజూరు అయిన నిధులు వినియోగం అయ్యే విధంగా తగు చర్యలు తీసుకోవాలన్నారు. త్వరలో జరగనున్న మానిటరింగ్ కమిటీ సమావేశానికి సంబంధిత అధికారులు ఈ నిధుల వినియోగంపై సమగ్ర కార్యచరణ ప్రణాళికలు సిద్ధం చేయాలన్నారు. అప్పటిలోగా ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధుల వారి అభ్యున్నతికి ఉపయోగ పడే విధంగా ఖర్చు చేయాలన్నారు. మానిటరింగ్ సమావేశంలో ఈ నిధుల విషయంగా ఎలాంటి సందేహాలు ఉండరాదని, ఈ సమవేశానికి వచ్చే వారికి దీనిపై సమగ్ర నివేదికలు అందించే విధంగా ముందస్తు చర్యలు తీసుకోవాలన్నారు. ఇందుకు నిర్ధేశించిన నిధులు ఆయా శాఖలు విధిగా ఖర్చు చేయాలన్నారు. ముఖ్యంగా స్థానిక అవసరాలకు ఉపయోగ పడే విధంగా పనులు జరగాలన్నారు. తిరుపతిలో సాంఘీక సంక్షేమశాఖ ద్వారా జరుగుతున్న స్టడీ సర్కిల్ పనులు ఈ నెలాఖరులోగా పూర్తి చేయాలన్నారు. కలికిరి పాలిటెక్నిక్ కళాశాల ఎస్సీ హాస్టల్ భవన పనులు ఈ ఏడాది డిసెంబర్ నాటికి పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. కుప్పం సాంఘీక సంక్షేమ శాఖ పాఠశాల పనులు జూన్ నాటికి పూర్తి చేసి వచ్చే విద్యా సంవత్సరంలో కొత్త భవనాల్లో పాఠశాల కొనసాగే విధంగా చర్యలు తీసుకోవలన్నారు. ఈనిధులను కార్యచరణ ప్రణాళికలు సంబంధిత అధికారులు సిద్ధం చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ పై సీరియస్‌గా సాంఘీక సంక్షేమ శాఖ మానిటరింగ్ చేయాలని అదేశించారు. తర్కాత ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ ద్వారా వచ్చిన నిధిలను శాఖలు వారీగా ఎంత వచ్చాయి, ఎంత ఖర్చు చేశారు ఇంకా నిధులు ఎంత మిగిలాయన్న దానిపై శాఖల వారీగా ఆరా తీశారు. ఈనిధులు కేవలం ఎస్సీ, ఎస్టీ ల కోసం వినియోగించాలని ఇందులో ఎటు వంటి అవకతవకలకు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. ఈసమావేశంలో సాంఘీక సంక్షేమ శాఖ అధికారి విజయకుమార్ , జలనరులు శాఖ అధికారి వేణు, హౌసింగ్ పిడి ధనుంజయుడు ఇతర జిల్లా అధికారులు పాల్గొన్నారు.