క్రైమ్/లీగల్

ఏ తల్లి కన్నబిడ్డో...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, ఏప్రిల్ 23: చూడడానికి ఎంతో ముచ్చటగొలుపుతున్న తల్లి గర్భం నుండి బాహ్యప్రపంచంలోనికి వచ్చిన పసికందు కొన్ని నిమిషాల వ్యవధిలోనే రుయా ఆసుపత్రి ఆవరణంలోని కాలువలో దర్శనమిచ్చిన సంఘటన సోమవారం తిరుపతిలో జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. ఏ తల్లి కన్నబిడ్డో కానీ ఆ తల్లిదండ్రులకు ఏమి కష్టం వచ్చిందో తెలియదు కానీ, పుట్టిన బిడ్డను గుడ్డలో చుట్టి పడేసిన దృశ్యాన్ని రుయా ఆవరణంలోని కొంతమంది రోగులు గుర్తించారు. వారు గుర్తించే సమయానికి కొన ఊపిరితో ఉన్న ఆ మగబిడ్డ కాలువ నుండి వెలికి తీసే సమయానికి మృతిచెందాడు. ఎంతో ముచ్చటగా ఉన్న ఆ బిడ్డను చూసిన రోగులు కంటతడిపెట్టారు. పోలీసులు బిడ్డ మృతదేహాన్ని ఖననం చేశారు. ఆ బిడ్డ ప్రసూతి ఆసుపత్రిలో జన్మించాడా? లేక మరెక్కడైనా జన్మించాడా? అని ఆరా తీసి తల్లిదండ్రులను గుర్తించే పనిలో పోలీసులు ఉన్నారు.

ప్రమాదవశాత్తు రైలు కింద పడి మహిళ మృతి
రేణిగుంట, ఏప్రిల్ 23: స్థానిక రైల్వేస్టేషన్‌లోని మూడవ నెంబర్ ప్లాట్‌పారంలో ప్రమాదవశాత్తు రైలు కిందపడి ఓ మహిళ అక్కడిక్కడే మృతిచెందిన సంఘటన సోమవారం సాయంత్రం జరిగింది. రైల్వే పోలీసుల కథనం మేరకు విజయవాడకు చెందిన రమాదేవి (60) శ్రీవారి దర్శనార్థం కుటుంబసభ్యులతో కలసి తిరుమలకు చేరుకుని శ్రీవారిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో రేణిగుంట మీదుగా విజయవాడకు పద్మావతి ఎక్స్‌ప్రెస్‌లో బయలుదేరారు. కదులుతున్న రైలు నుండి దిగే ప్రయత్నం చేసి ప్రమాదవశాత్తు రైలు కింద పడి అక్కడికక్కడే మృతి చెందింది. సీఆర్‌పీఎఫ్ పోలీసులు మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రుయా ఆసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

ఇద్దరు ఎర్రచందనం దొంగలు అరెస్ట్
* 8కేజీల ఎర్రచందనం దుంగలు, కారు స్వాధీనం
పెనుమూరు, ఏప్రిల్ 23: శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం దుంగలను ఆదివారం పోలీసులు పట్టుకున్నారు. సోమవారం విలేఖర్ల సమావేశంలో ఎస్సై చాన్‌బాషా మాట్లాడుతూ పెనుమూరు మండలం సమీపంలోని రాజా ఇండ్లు రిజర్వ్ ఫారెస్ట్ వద్ద వాహనాల తనిఖీ చేస్తుండగా అతి వేగంగా వస్తున్న కారును దాడులు నిర్వహించి పట్టుకున్నారు. అయితే ఈ కారులో ఇద్దరు ఎర్ర కూలీలు, సుమారు 8కేజీల ఎర్రచందనం దుంగలు తరలిస్తున్నట్లు గుర్తించారు. వెంటనే వారిని అదుపులోకి తీసుకున్నారు. ఈ ఎర్రచందనం కూలీలు తమిళనాడుకు చెందిన వారని గుర్తించారు. వీరిలో అప్పాస్వామి(42), ఇళయరాజా(23)లు శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనాన్ని పట్టుకున్నారన్నారు. ఈమేరకు వీరిపై కేసు నమోదు చేసి రిమాండ్‌కు పంపుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పెనుమూరు పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.