మహబూబ్‌నగర్

ఘనంగా క్రిస్మస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహబూబ్‌నగర్, డిసెంబర్ 25: జిల్లా వ్యాప్తంగా క్రిస్మస్ వేడుకలు శుక్రవారం ఘనంగా జరిగాయి. క్రిస్మస్ పండుగను పురస్కరించుకుని వివిధ గ్రామాలలోని చర్చిలలో క్రైస్తవులు ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లాలోని షాద్‌నగర్, జడ్చర్ల, కల్వకుర్తి, అచ్చంపేట, నాగర్‌కర్నూల్, కొల్లాపూర్, వనపర్తి, గద్వాల, అలంపూర్, దేవరకద్ర, కొడంగల్, నారాయణపేట, మక్తల్ నియోజకవర్గాలలోని వివిధ గ్రామాలలో క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి. పలు పట్టణాలలో క్రిస్మస్‌ను పురస్కరించుకుని చర్చిలకు క్రైస్తవులు తరలిరావడంతో ఉదయం నుండే చర్చిల దగ్గర జనం కిక్కిరిసిపోయారు. పిల్లాపాపలతో కుటుంబ సభ్యులు చర్చిలకు వచ్చి ప్రత్యేక ప్రార్థనలు చేశారు. జిల్లా కేంద్రమైన మహబూబ్‌నగర్ పట్టణంలోని ఎంబిసి చర్చికి క్రైస్తవులు పోటెత్తారు. ఎంబిసి చర్చిలో జరిగిన క్రిస్మస్ వేడుకల కేక్‌ను ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ రాదాఅమర్ పాస్టర్ వరప్రసాద్‌లు కట్ చేసి క్రైస్తవులకు శుభాకాంక్షలు తెలిపారు. అదేవిధంగా డిసిసి అధ్యక్షుడు ఉబేదుల్లా కొత్వాల్, మాజీ డిసిసి అధ్యక్షుడు ముత్యాల ప్రకాష్, టిడిపి నియోజకవర్గ ఇంచార్జి ఎన్‌పి వెంకటేష్ జిల్లా ఆసుపత్రి మాజీ సూపరింటెండెంట్ శ్యామూల్‌తో పాటు పలువురు ప్రముఖులు క్రిస్మస్ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎంబిసి చర్చి పాస్టర్ వరప్రసాద్ మాట్లాడుతూ నూతన తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కెసిఆర్ క్రైస్తవులపై ప్రేమాభిమానాలు చూపిస్తున్నారని, క్రైస్తవ భవనం నిర్మించడం సంస్థ క్రైస్తవులు కెసిఆర్‌కు దీవెనలు ఇచ్చారని అన్నారు. యేసుప్రభువు తెలంగాణ ప్రభుత్వానికి పూర్తి ఆశీర్వాదం ఇస్తున్నారని తెలిపారు. క్రిస్మస్ వేడుకల్లో ఎమ్మెల్యే శ్రీనివాస్‌గౌడ్ మాట్లాడుతూ క్రైస్తవుల అభివృద్ధి కోసం ప్రభుత్వం కృషి చేస్తుందని, జిల్లా కేంద్రంలో స్మశాన వాటిక కోసం భూమిని కేటాయించడం జరిగిందని వెల్లడించారు. ముఖ్యమంత్రి కెసిఆర్ తెలంగాణలో క్రైస్తవులకు కూడా అన్ని రంగాలలో పెద్దపీట వేస్తున్నారని, అందులో భాగంగా రూ. 10 కోట్ల వ్యయంతో హైదరాబాద్‌లో క్రైస్తవ భవన నిర్మాణానికి శ్రీకారం చుట్టారని అన్నారు. పట్టణంలో వేలాది మంది క్రైస్తవులు ఉన్నారని, క్రిస్మస్ వేడుకలు ఇంత వైభవంగా జరుపుకోవడం అందరి మధ్య తాను ఉండడం అదృష్టంగా భావిస్తున్నానని, యేసుప్రభువు కృపతో నియోజకవర్గ అభివృద్ధి కోసం తన శాయశక్తులా కృషి చేస్తానని అన్నారు. అంతేకాకుండా క్రిష్టియన్‌పల్లి, క్రిష్టియన్ కాలనీతో పాటు పలు వార్డులలోని చర్చిలలో కూడా క్రిస్మస్ వేడుకలు ఘనంగా జరిగాయి.