Others

నీడ -- నాకు నచ్చిన సినిమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

దాసరి నారాయణరావు దర్శకత్వంలో రూపొందిన నీడ చిత్రం అంటే నాకు చాలా ఇష్టం. ఎన్నో చిత్రాలు వస్తాయి. కానీ సమాజానికి ప్రయోజనకరమైన చిత్రాలు ఎప్పుడో ఒకటి వస్తాయి. ఈ చిత్రం యువతరాన్ని నిర్దేశించి రూపొందించింది. ఆవు గట్టున మేస్తే దూడ చేలో మేస్తుందా? అన్న సామెతకు తెర రూపం ఈ చిత్రం. పెద్దలు ఎలా ప్రవర్తిస్తే వాళ్లను చూసి పిల్లలు అలా పెరుగుతారు. పెద్దల నీడలు పిల్లలపై పడి వారి జీవితాలను ఏ విధంగా మారుస్తున్నాయి అనే కథనంతో ఈ చిత్రం సాగుతుంది. కృష్ణ పెద్దకుమారుడు రమేష్‌బాబు నవ యవ్వనుడుగా ఈ చిత్రంలో నటించాడు. తండ్రి స్ర్తి వ్యామోహాన్ని గమనించిన కొడుకు తాను కూడా అదే బాటలో పయనించి, చివరికి అధోగతి పాలవుతాడు. మొత్తం ఐదుగురు యువ ప్రతినిధులను ఈ చిత్రంలో చూపారు. ఒకరు ఉదాశీనతకు లోనైన తల్లిచాటు కొడుకు. మరొకరు బాల్యవివాహం అయ్యాక భర్తపోయిన వితంతువు. మరొకరు చిన్నతనంలోనే తల్లిదండ్రులకు దూరమై ఇళ్లల్లో పాచిపనులు చేసుకునే అమ్మాయి. వీళ్ల జీవితాలు పెద్దల నీడలు పడి ఏ విధంగా పతనమయ్యాయి అన్న కథనాన్ని దర్శకుడు తనదైన శైలితో అద్భుతంగా తీర్చిదిద్దారు. బ్లాక్ అండ్ వైట్ చిత్రం అయినా ఇప్పటివారు చూసినా ఈ చిత్రం ఆకట్టుకుంటుంది. ఇప్పుడు వచ్చే పిచ్చిపిచ్చి ప్రేమాయణాల చిత్రాలకు చెంపపెట్టుగా నీడ సినిమా నిలుస్తుంది. నటించిన ప్రతి ఒక్కరూ తమ పాత్రలో మాత్రమే కనిపించారు. ఇప్పటికి ఈ చిత్రం విడుదలై దాదాపు 30 సంవత్సరాలు గడిచిపోయినా నిత్య నూతనంగానే వుంటుంది.
- టి.రఘురామ్,
నరసరావుపేట