జాతీయ వార్తలు

న్యాయం ప్రతీకార రూపంలో ఉండరాదు:సీజేఐ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజస్థాన్: దేశ వ్యాప్తంగా దిశ హత్యోదోంతపై, అనంతరం నిందితుల ఎన్‌కౌంటర్‌పై చర్చ జరుగుతున్న వేళ సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ ఎన్‌ఏ బోబ్డే ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. రాజస్థాన్‌లోని కోర్టు భవన ప్రారంభోత్సవంలో ఆయన మాట్లాడుతూ న్యాయం ప్రతీకార రూపంలో ఉండకూడదని, అలా జరిగితే న్యాయం రూపురేఖలు కోల్పోతుందని అన్నారు. కేంద్ర న్యాయ శాఖ మంత్రి రవిశంకర్ ప్రసాద్ మాట్లాడుతూ రేప్ కేసుల్లో త్వరగా తీర్పులు వెలువడాలని ఆకాంక్షించగా సీజేఐ విభేదించారు. న్యాయాన్ని ప్రజలకు అందుబాటులో ఉంచుతూనే వేగవంతంగా, సంతృప్తికరంగా వివాదాల్లో రాజీ కుదర్చాలి లేదా పరిష్కారం చూపాలని సీజేఐ వ్యాఖ్యానించారు. న్యాయవ్యవస్థ, వ్యాజ్యాలలో వస్తున్న మార్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. ఒక వ్యాజ్యం పరిష్కారంలో ఎక్కువ సమయం తీసుకుంటే నేరానికి పాల్పడినట్టేనని అన్నారు.