జాతీయ వార్తలు

అవసరమైతే కశ్మీర్‌లో పర్యటిస్తా:చీఫ్ జిస్టిస్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: అవసరమైతే తాను జమ్మూకశ్మీర్‌లో పర్యటిస్తానని సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ రంజన్ గొగొయ్ అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత ఆజాద్ వేసిన పిటిషన్‌పై విచారించిన ధర్మాసనం ఆజాద్ కశ్మీర్ వెళ్లవచ్చని, తన కుటుంబ సభ్యులను కలుసుకోవచ్చని సుప్రీం కోర్టు అనుమతి ఇచ్చింది. ఈ మేరకు ఆంక్షలతో అనుమతి ఇచ్చింది. కశ్మీర్‌లో పరిస్థితులను తెలుసుకోవడానికి.. కుటుంబ సభ్యులను కలిసేందుకు తనను అనుమతించాలని కోరుతూ సుప్రీం కోర్టులో ఆజాద్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై విచారించిన అత్యున్నత న్యాయస్థానం.. శ్రీనగర్, బారాముల్లా, అనంత్ నాగ్, జమ్ములలో పర్యటించవచ్చని తెలిపింది. అయితే ఎలాంటి సభలు, ర్యాలీలు నిర్వహించొద్దని.. ప్రసంగాలు చేయొద్దని పేర్కొంది.