జాతీయ వార్తలు

ఆర్టీఐ పరిధిలోకి సీజేఐ కార్యాలయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

న్యూఢిల్లీ: ఆర్టీఐ పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం కూడా ఉంటుందని అత్యున్నత న్యాయస్థానం తీర్పును ఇచ్చింది. సమాచార హక్కు చట్టం పరిధిలోకి సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయం వస్తుందంటూ 2010లో ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సుప్రీంకోర్టు ఐదుగురు సభ్యుల ధర్మాసనం సమర్ధించింది. కాగా ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ సుప్రీం కోర్టు సెక్రటరీ జనరల్, కోర్టుకు చెందిన కేంద్ర ప్రజా సమాచార అధికారి సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. వీటిపై జిస్టిస్ రంజన్ గొగొయ్ నేతృత్వంలోని జస్టిస్ ఎస్.వి రమణ, జస్టిస్ వై. చంద్రచూడ్, జస్టిస్ దీపక్ మిశ్రా, జస్టిస్ సంజీవ్ ఖన్నాలతో కూడిన ధర్మాసనం విచారణ చేపట్టింది. విచారణ జరిపిన న్యాయస్థానం వీటిపై తీర్పును ఈ ఏడాది ఏప్రిల్ 4న రిజర్వ్‌లో ఉంచింది. తీర్పును నేడు వెల్లడించింది. ధర్మాసనంలోని మెజార్టీ న్యాయమూర్తులు ఢిల్లీ హైకోర్టు తీర్పునే సమర్థించారు. పారదర్శకత అనేది న్యాయస్వేచ్ఛకు భంగకరం కాదని, గోప్యత హక్కు, సమాచార హక్కు కలిసి పనిచేయాలని, న్యాయ వ్యవస్థ పరిశీలనకు ఆర్టీఐ ఒక సాధనంగా ఉండాలని అభిప్రాయపడింది.