'క్లాప్' కొట్టు గురూ!

ఆశలు నెరవేరేనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలభామ కేథరిన్ ఆశలు ఇప్పటికీ నెరవేరడం లేదు. వెండితెరపై ఎన్నో ఆశలతో అడుగుపెట్టింది. ఎంతగానో ఎదిగిపోవాలని కలలుగన్నది. అయితే ఈ అమ్మడు అనుకున్న ఆశలు నీరుగారిపోయాయి. వచ్చిన అవకాశాలు వచ్చినట్టే వచ్చి చేజారిపోయాయి. చేసిన కొద్ది చిత్రాలే అయినా ఆయా చిత్రాల్లో పోషించిన క్యారెక్టర్లు మాత్రం నటిగా కేథరిన్‌కు మంచి పేరునే తెచ్చిపెట్టాయి. తాజాగా బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా బోయపాటి శ్రీను దర్శకత్వంలో వస్తున్న చిత్రంలో కేథరిన్ తళుక్కున మెరవనుందట. అదీ..ప్రత్యేక గీతంలోనట. బోయపాటి గతంలో రూపొందించిన ‘సరైనోడు’ చిత్రంలో కేథరిన్ కథానాయికగా నటించి మెప్పించింది. ఇప్పుడు మరోసారి ఈ భామకు దర్శకుడు అవకాశం కల్పించాడు. ‘‘ఈ ఏడాదిలో అత్యుత్తమ ప్రత్యేక గీతాల్లో ఇదీ ఒకటిగా నిలిచిపోతుందని, యాక్షన్, వినోదంతో పాటు కుటుంబ బంధాలకు చోటు వుండే చిత్రమిది’’అని చెబుతున్నారు దర్శకుడు బోయపాటి. అయితే కేథరిన్ ప్రత్యేక గీతం మాత్రం చిత్రానికే కాదు, తన కెరీర్‌కూ బాగా దోహదం చేస్తుందంటున్నాయ యూనిట్ వర్గాలు. వీరు చెప్పినట్లు జరిగితే నిజంగానే కేథరిన్ ఆశలు నెరవేరుతాయన్న నమ్మకం కలుగుతుంది కదూ.. చూద్దాం..!

-సమీర్