'క్లాప్' కొట్టు గురూ!

వాహ్..ప్రియాంక!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లోని సక్సెస్‌ఫుల్ హీరోయిన్లలో అందాలతార ప్రియాంక చోప్రా ఒకరు. హిందీ చిత్రసీమలో తన చిత్రాల ద్వారా, ఆమె చేసిన పాత్రల ద్వారా ఎంతో పాపులారిటీ సంపాదించుకుంది. తాజాగా అమెరికన్ టీవీ సీరిస్ క్యాంటికోతో ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపును పొందారు. ఆస్కార్ అవార్డుల ప్రదానోత్సవంలో పాల్గొన్న మొట్టమొదటి భారత వ్యాఖ్యాతగా రికార్డు సృష్టించారు. అంతే గాకుండా ‘బేవాచ్’ అనే హాలీవుడ్ సినిమాలో నటిస్తున్నారు. ఇలా వేసే ప్రతి అడుగు ప్రియాంక చోప్రాను ఎక్కడికో తీసుకెళుతోంది. ఇంతటి విజయాలను ఎలా ఆస్వాదిస్తున్నారని ప్రియాంకను ప్రశ్నిస్తే- ‘‘నేను చేసిన చిత్రాలు, అందులో పోషించిన పాత్రలు నాకు ఇంతటి పేరును తెచ్చిపెట్టాయని భావిస్తున్నాను. అదంతా నన్ను నమ్మి, నాపై అభిమానం కురిపించిన బాలీవుడ్‌కే చెందుతుంది. ఆదరించిన ప్రేక్షకులను నేను ఎన్నటికీ మరచిపోలేను’’అంటోంది.
వాహ్..ప్రియాంక! రియల్లీ..గ్రేట్!!

-సమీర్