'క్లాప్' కొట్టు గురూ!

దర్శకత్వం వైపు...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలనటిగా అనేక చిత్రాల్లో చక్కటి నటనను కనబరిచి అందర్నీ ఆకట్టుకున్న షామిలీ కథానాయికగా రంగప్రవేశం చేసి కెరీర్‌లో నిలదొక్కుకోలేకపోయింది. బాలనటిగా మాత్రమే ప్రేక్షకులు ఆమెను ఆదరించారు కానీ, హీరోయిన్‌గా మాత్రం చూడలేకపోయారు. గతంలో చాలా మంది హీరోయిన్లు దర్శకులుగా అవతారమెత్తారు. ఇప్పుడు ఆ జాబితాలో షామిలీ కూడా చేరే ప్రయత్నం చేస్తోందిట. హీరోయిన్‌గా సక్సెస్ కాలేకపోవడంతో కొంత కాలం కెనడాకు వెళ్లి సినిమాలకు సంబంధించిన కోర్సులో ప్రావీణ్యం సంపాదించింది. తిరిగి హీరోయిన్‌గా నటించినా అదృష్టం కలిసిరాలేదు. ఈ నేపథ్యంలో ఇక లాభం లేదనుకున్న షామిలీ దర్శకత్వం వైపునకు కనే్నసిందని, అదే ప్రయత్నంలో ఉందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. సో.. ఆల్ ది బెస్ట్ షామిలీ అని చెబుదాం!

-సమీర్