'క్లాప్' కొట్టు గురూ!

పెళ్లికి రెడీ..కానీ..!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

నచ్చినోడు దొరికితే ఇట్టే పెళ్లికి రెడీ..అంటోందిట అందాల తార కాజల్ అగర్వాల్. టాలీవుడ్, కోలీవుడ్ చిత్రాల్లో అతి తక్కువ సమయంలో అగ్ర హీరోలతో జోడీకట్టి తన నటనతో అందర్నీ ఆకట్టుకున్న ఈ అమ్మడు బాలీవుడ్‌లోనూ అడుగుపెట్టి అక్కడా తనేంటో నిరూపించుకునే దిశలో అడుగులు కదుపుతోంది. నటిగా దక్షిణాదిలోనే పుష్కర కాలాన్ని ఎంతో అవలీలగా దాటేసిన ఈ ఉత్తరాది భామ నేటికీ క్రేజీ హీరోయిన్‌గానే రాణిస్తూ తన స్టామినాను నిరూపించుకుంటోంది. తాజాగా అజిత్‌కు జంటగా నటించిన ‘వివేకం’ చిత్రం బాక్సాఫీస్ వద్ద రికార్డు స్థాయిలో కలెక్షన్లు కొల్లగొడుతోంది. మరో స్టార్ హీరో విజయ్‌కు జంటగా నటించిన ‘మెర్శల్’ చిత్రం త్వరలోనే తెరపైకి రానుంది. వీటితో పాటు హిందీ చిత్రం ‘క్వీన్’ రీమేక్‌లో నటించడానికి రెడీ అవుతున్నట్లు వినిపిస్తోంది. నటనతో పాటు వాణిజ్య ప్రకటనలతోనూ బాగానే సంపాదించేస్తోందనే ప్రచారం జోరుగానే సాగుతోంది. ఇటీవల ‘నేను పక్కా లోకల్’ అంటూ ఐటమ్ సాంగ్‌లోనూ దుమ్మురేపి ఆ ముచ్చటా తీర్చేసుకుని అందరి దృష్టిని విశేషంగా ఆకర్షించింది. అంతేకాదు, ఇద్దరు లేదా ముగ్గురు హీరోయిన్ల చిత్రాల్లో కూడా నటిస్తోంది. ఇలా చేయడం వల్ల తనకేమీ అభ్యంతరం లేదని కూడా పక్కాగా చెబుతోంది. కథ, అందులో తన ప్రాత ఏమిటన్నదే ముఖ్యమంటోందిట! తెలుగు, తమిళ చిత్ర పరిశ్రమలే నటిగా తనకు జీవితాన్నిచ్చాయి. నటిగా బాలీవుడ్‌లో బిజీ అయినా దక్షిణాదిని మాత్రం వదిలి వెళ్లే ప్రసక్తేలేదని కూడా కాజల్ అంటోంది. ఇదిలా వుండగా ఇంతకీ మరి పెళ్లెప్పుడు? అని కాజల్‌ని కదిలిస్తే- ‘‘బాగానే అడిగారు. నేను వెళ్లిన చోటల్లా అందరూ ఇదే ప్రశ్న వేస్తున్నారు. నాకు నచ్చినోడు దొరికితే తప్పకుండా పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ అయిపోతాను. అయితే ప్రస్తుతం నా ప్రాణం, నా శ్వాస నటనే’’అంటూ ఎంతో తెలివిగా చెప్పుకొచ్చింది. దటీజ్..కాజల్!