'క్లాప్' కొట్టు గురూ!

హద్దులు మీరుతోంది...!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

చాలా కాలంగా అవకాశాలే లక్ష్యంగా గ్లామర్ విషయంలో హద్దులు మీరి నటిస్తున్న సెక్సీ నటి రాయ్‌లక్ష్మీ. తాజాగా బాలీవుడ్ చిత్రం ‘జూలీ-2’లో ఈ అమ్మడి గ్లామర్ హద్దులు మీరింది. ఈ భామ చిందించిన గ్లామర్ హద్దులు మీరిందని అందరూ అనుకుంటున్నారు. వారి మాటలను నటి రాయ్ సిల్లీగా కొట్టి పారేస్తోంది. తెలుగు, కన్నడం, మలయాళం అంటూ దక్షిణాది భాషల్లో 50కి పైగా చిత్రాల్లో నటించిన ఈ బ్యూటీ కథానాయికగా ఏ భాషలోనూ నిలదొక్కుకోలేకపోయింది. అంతేకాదు, ఐటమ్ సాంగ్స్‌కూ సిద్ధపడి విజృంభించింది. మెగాస్టార్ చిరంజీవితో ‘ఖైదీ నంబర్ 151’లో రెచ్చిపోయి అందాల కనువిందు చేసింది. ఇలాంటి అవకాశాలతో బాలీవుడ్‌లోనూ మంచి అవకాశాలు రాబట్టాలన్నదే రాయ్‌లక్ష్మీ చిరకాల వాంఛ. ఆ వాంఛతోనే ‘జూలీ-2’ చిత్రంలో నటించే అవకాశాన్ని దక్కించుకుంది. తాజాగా ఈ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ ప్రేక్షకుల ముందుకు రావడంతో అందులో రాయ్‌లక్ష్మీ హాట్ దృశ్యాలను చూసి అంతా వాహ్..బాప్‌రే రాయ్! అంటూ విస్తుపోతున్నారు. చూద్దాం.. రాయ్‌లక్ష్మీ తన గ్లామర్‌తో మరెన్ని మెరుపులు మెరిపిస్తోందో..!