'క్లాప్' కొట్టు గురూ!

జోరు..జోరుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాల రాక్షసి లావణ్య త్రిపాఠి కెరీర్ యమ జరుమీదుంది. చేసే సినిమాలు అయితేనేమి.. పోషించే పాత్రలు అయితేనేమి... వేటికవే భిన్నంగా వుండేలా చూసుకుంటూ కెరీర్‌లో మంచి స్థాయికి ఎదిగేందుకు అహర్నిశలు శ్రమిస్తోంది. తాజాగా నాగచైతన్యతో ‘యుద్ధం శరణం’ చిత్రం చేసింది. టాలీవుడ్‌లో అటు క్రేజీ హీరోలు, ఇటు యువతరం కథానాయకులతో జోడీ కడుతూ తనకంటూ ఓ ఇమేజ్‌ని సృష్టిచుకుంటోంది. ఓ పక్క టాలీవుడ్‌లో వైవిధ్యమైన పాత్రల ద్వారా అటు పరిశ్రమ, ఇటు ప్రేక్షకుల దృష్టిని తనవైపునకు మరల్చుకున్న ఈ బ్యూటీ మరో అడుగు ముందుకేసి కోలీవుడ్‌లోనూ సత్తా చాటేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తోంది. అయితే ఈ అమ్మడు ఎంతగానో కలలుగంటున్న కోలీవుడ్ ఆశలు అంత సునాయసంగా తీరేలా కనిపించడంలేదు. రీమేక్ సినిమాతో తమిళనాట సక్సెస్ సాధించాలని భావించిన లావణ్య కోరిక తీరేలా లేదు. నాగచైతన్య, తమన్నా కాంబినేషన్‌లో సుకుమార్ దర్శకత్వంలో ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘100%లవ్’. ఈ చిత్రాన్ని జీవీ ప్రకాష్ హీరోగా తమిళంలో రీమేక్ చేస్తున్నారు. ఇందులో ముందుగా హెబ్బా పటేల్‌ను కథానాయికగా తీసుకోవాలని భావించారు. కానీ చివరకు లావణ్య త్రిపాఠినే ఓకే చేశారు. అయితే ఈ చిత్రం కోసం స్లిమ్‌గా మారాలని అనుకుంది. అయితే చివరకు ఈ ప్రాజెక్టునుంచి తప్పుకున్నట్లు తెలిసింది. కారణం.. రీమేక్ చిత్రాలకు డేట్స్ అడ్జస్ట్ చేయలేక పోవడం వల్లే ఇలా జరిగిందని ఆమె సన్నిహితులు చెబుతున్నారు. ప్చ్..లావణ్య!