'క్లాప్' కొట్టు గురూ!

అవధుల్లేని ఆనందం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అందాలతార సమంత క్రేజ్ రోజు రోజుకీ బాగా పెరిగిపోతూనే వుంది. ఈ క్రేజ్ ఒక్క టాలీవుడ్‌లోనే కాదు...తమిళంలోనూ ఊపందుకుంటోంది. తెలుగులో ‘అ ఆ’ చిత్రం విడుదలకు సిద్ధంగా వుండగా, ‘జనతా గ్యారేజ్’ సెట్స్‌పై ఉరకలు వేస్తోంది. తమిళంలోనూ సమంత హవా బాగానే ఉంది. ‘24’, ‘తెరి’ చిత్రాలు అక్కడ మంచి విజయాలను నమోదు చేసుకోవడంతో కోలీవుడ్ మొత్తం ఈ ముద్దుగుమ్మ వైపే చూస్తోంది. సమంత కోరిక కూడా ఇదే. తమిళనాట మంచి విజయాలను అందుకోవాలన్నదే ఈ అమ్మడి లక్ష్యం. టాలీవుడ్‌లో ఇప్పటికే అగ్రతారగా వెలుగొందుతున్న విషయం తెలిసిందే. అయితే ఎప్పటికైనా కోలీవుడ్‌లో టాలీవుడ్ అంతటి క్రేజ్ సంపాదించుకోవాలన్నదే సమంత ఆశ. ఆ ఆశ ఇప్పటికి ఇలా రూపుదిద్దుకుంటుండడం ఆమెకు ఎంతో ఆనందంగా వుంది. ఇలా రెండు పడవల ప్రయాణం ఎలావుంది? అని సమంతాను కదిలిస్తే- ‘‘నటి అన్నాక ఎన్నో భాషల్లో చేయాలి. ఎక్కడ ఆదరణ వుంటే అక్కడే ఎక్కువ చిత్రాలు చేయాలి. నాకు ప్రస్తుతం తెలుగు, తమిళంలో మంచి ఆదరణ వుంది. ఆయా భాషల్లో వస్తున్న నా చిత్రాలు చూసి అటు ప్రేక్షకులు..ఇటు చిత్రసీమ ఎంతో మెచ్చుకుంటోంది. అది చాలు నాకు’’అంటూ ఎంతో ఆనందంతో సెలవిచ్చింది సమంత.

-సమీర్