'క్లాప్' కొట్టు గురూ!

జోరుగా..హుషారుగా!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్ భామ దీపికా పదుకొనే జోరుగా.. హుషారుగా కనిపిస్తోంది ఈమధ్య. అందుకు కారణం లేకపోలేదు.. తన హుషారంతా తాజా చిత్రం ‘పద్మావతి’ గురించేనట. ఈ చిత్రంలో ధగధగలాడే వస్త్రాలు.. ఒంటి నిండా నగలు. తలపై మేలి ముసుగు ధరించి అంతఃపుర స్ర్తిలతో కలిసి రంగంలోకి దిగి చిందేయడం మరచిపోలేకపోతుందిట. ‘ఘుమార్ ఘుమార్ ఘుమె..’ అంటూ సాగే రాజస్థానీ జానపద గీతానికి హుషారుగా కాలుకదిపింది దీపికా. ‘పద్మావతి’ చిత్రంలోని ఈ పాటలో కనిపించే సందడి రాజ్‌పుత్ రాజస్థానికి అద్దం పడుతుందట. ఇందులో రాజ్‌పుత్ మహారాణి పద్మిని పాత్రలో దీపికా ఎంతో హుషారుగా కనిపిస్తుందట. రణవీర్‌కపూర్, షాహిద్ కపూర్ ప్రధాన పాత్రల్లో సంజయ్‌లీలా భన్సాలీ తెరకెక్కిస్తున్న చిత్రమిది. ఇటీవలే విడుదలైన ఈ పాటకు వీక్షకుల నుంచి విశేష స్పందన లభిస్తోంది. ఈ చిత్రంలోని పద్మిని క్యారెక్టర్ తనకు మైలురాయిలా నిలుస్తుందని గట్టి నమ్మకాన్ని వ్యక్తం చేస్తుంది దీపికా.

-సమీర్