'క్లాప్' కొట్టు గురూ!

ఎన్‌టిఆర్‌కు జోడీగా..

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మలయాళీ భామ అనూ ఇమ్మానుయెల్ జోరు మామూలుగా లేదు. వరుస సినిమాలతో బిజీగా వున్న ఈమె టాలీవుడ్ స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తూ దూసుకుపోతోంది. ప్రస్తుతం గోపీచంద్ సరసన ‘ఆక్సిజన్’లో నటిస్తున్న అను మరో వైపు పవన్‌కళ్యాణ్ త్రివిక్రమ్‌ల కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న చిత్రంలోనూ నటిస్తోంది. తాజాగా మరో క్రేజీ అవకాశాన్ని దక్కించుకుంది. ‘జై లవకుశ’ తర్వాత ఎన్‌టిఆర్ నటించే చిత్రం ఇటీవలే ప్రారంభమైన విషయం తెలిసిందే. క్రేజీ దర్శకుడు త్రివిక్రమ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో అనూ ఇమ్మానుయెల్‌ను హీరోయిన్‌గా ఎంపిక చేశారట. నిజానికి ఈ సినిమా కోసం ‘డిజె’ భామ పూజా హెగ్డేను ఎంపిక చేస్తారంటూ వార్తలొచ్చాయి. కానీ త్రివిక్రమ్ మాత్రం అనూకే ప్రాముఖ్యత ఇచ్చినట్లు తెలుస్తోంది. దాంతో పాటు అల్లు అర్జున్ సినిమాలోనూ నటిస్తున్న అనూకు వరుస అవకాశాలు క్యూ కట్టాయి. అందం నటన పుష్కలంగా ఉన్న ఈమె స్టార్ హీరోయిన్లకు గట్టి పోటీ ఇవ్వనుంది.