'క్లాప్' కొట్టు గురూ!

బయోపిక్‌లో కంగనా?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

బాలీవుడ్‌లో బయోపిక్‌ల ట్రెండ్ ఇంకా కొనసాగుతూనే వుంది. అలాంటి సినిమాలు అటు బాక్సాఫీస్ వద్ద ఘనవిజయాన్ని అందుకోవడంతో ఆ తరహా సినిమాలు తీయడానికి దర్శక నిర్మతలు క్యూ కడుతున్నారు. తాజాగా మరో బయోపిక్ కోసం సన్నాహాలు మొదలయ్యాయి. ఒంటికాలితో ఎవరెస్టు శిఖరాన్ని అధిరోహించిన అరుణిమ సిన్హా జీవిత కథను తెరకెక్కించే సన్నాహాలు జరుగుతున్నాయి. ఆమె జీవిత కథతో తెరకెక్కే సినిమాలో హీరోయిన్‌గా నటిస్తున్నది ఎవరో కాదు, బాలీవుడ్ ఫైర్‌బ్రాండ్ కంగనా రనౌత్? ప్రస్తుతం క్రిష్ దర్శకత్వంలో మణికర్ణిక చిత్రంలో నటిస్తున్న కంగనా నెక్స్ట్ సినిమా అదే. ఈ సినిమా కోసం ముందు కృతిసనన్‌ని అడిగారట. కానీ ఆమె నో చెప్పడంతో కంగనా దగ్గరికి ఆ ప్రాజెక్టు వెళ్లింది. జాతీయ స్థాయి వాలీబాల్ క్రీడాకారిణిగా వున్న అరుణిమ సిన్హాను 2011లో రన్నింగ్ ట్రైన్ నుండి తోసేయడంతో ఆమెకు కాలు తొలగించారు. అయినా ఎంతో మనోధైర్యంతో ఒంటికాలుతో ఎవరెస్టుని ఎక్కి తన సత్తాను చాటింది.