'క్లాప్' కొట్టు గురూ!

కామసూత్ర!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఇదేదో.. యాడ్‌కు సంబంధించిన పేరు అనుకునేరు. శ్రీలంక నుండి వచ్చి భారత్‌లో తన హవా చాటుకున్న నటి జాక్వెలిన్ ప్రారంభించిన ఓ రెస్టారెంట్ పేరు ఇది. ఆశ్చర్యపోతున్నారా? సూపర్ మోడల్‌గా భారత్‌లో ఎదిగిన ఈ అమ్మడు కింగ్ ఫిషర్ క్యాలెండర్ గాళ్‌గా బాగా క్రేజ్‌ని కొట్టేసింది. అంతటితో ఆగకుండా బాలీవుడ్‌లో హీరోయిన్‌గా సల్మాన్ ఇచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని సత్తా చాటింది. అప్పటినుండి వరుస అవకాశాలతో దుమ్ము రేపుతోంది. ‘రేస్ 3’ చిత్రంలో సల్మాన్‌ఖాన్‌తో, ‘డ్రైవ్ ’చిత్రంలో సుశాంత్‌సింగ్ రాజ్‌పుత్‌తో జోడీకడుతోంది. ఈ సంపాదన అంతా చాలక ముందుగా మేలుకొని హోటళ్ల వ్యాపారంలో కూడా వీర విహారం చేసేస్తోంది. తన సంపాదన అంతా అక్కడే పెట్టుబడి పెడుతోందట. హోటళ్లకు ఏం పేరు పెట్టాలి అనుకున్నపుడు యూనివర్సల్ టైటిల్ కోసం వెతికి చివరికి ఈ టైటిల్‌ను పెట్టుకుందామె. తన రెస్టారెంట్‌లోకి వచ్చిన విదేశీయులకు వైవిధ్యమైన ఆతిథ్యం ఉంటుందని ప్రచారం చేస్తోంది. త్వరలో కామసూత్ర హోటళ్లు భారత్‌లో కూడా అడుగుపెట్టనున్నాయట!