'క్లాప్' కొట్టు గురూ!

కోలీవుడ్‌పై గురి!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఎన్నో ఆశలతో..మరెన్నో ఆశయాలతో వెండితెరపై అడుగుపెట్టిన అందాలతార కేథరిన్ థెరిస్సాకు టాలీవుడ్‌లో కాలమే కలిసిరాలేదు. వచ్చిన అవకాశాలను చక్కటి నటనతో ఆకట్టుకుని నటిగా మంచి మార్కుల్నే కొట్టేసింది. అయినా ఆమె కెరీర్‌లో అన్నీ ఒడిదుడుకులే! తెలుగులో గ్లామర్ తారగానే కేథరిన్‌ను గుర్తించారు తప్ప, మంచి పెర్‌ఫార్మెన్స్‌ని ప్రదర్శించగలనన్నది ఎవ్వరూ గుర్తించలేకపోయారు. అందుకే టాలీవుడ్‌లో ఈ భామ పరిస్థితి అలా దాపురించింది. తాజాగా కోలీవుడ్‌పై గురిపెట్టిన ఈ అమ్మడికి అక్కడ మంచి అవకాశాలే వస్తున్నాయి. టాలీవుడ్‌లో ‘ఇద్దరమ్మాయిలతో...’ చిత్రంలో అందారల ఆరబోతతో దుమ్మురేపిన ఈ దుబాయ్ బ్యూటీ తమిళంలోకి వచ్చేసరికి పక్కింటి అమ్మాయి పాత్రలో ‘మెడ్రాస్’ చిత్రంలో బాగానే నటించింది. ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద చక్కటి విజయాన్ని నమోదు చేయడంతోఇకపై అలాంటి నటనకు అవకాశం వున్న మంచి పాత్రలు వస్తాయని ఆశించింది. అయితే అనుకున్నదొక్కటీ అయ్యింది ఒక్కటి అన్నట్టుగా కేథరిన్ పరిస్థితి మారింది. అటు తర్వాత విశాల్ సరసన ‘కథకళి’, అధర్వతో ‘కణిదన్’ చిత్రాల్లో నటించింది. ఆయా చిత్రాల్లో అమ్మడు గ్లామర్ డాల్ పాత్రల్నే పోషించింది. అయితే తనను గ్లామర్‌డాల్‌గానే గుర్తిస్తున్నారని కేథరిన్ తెగబాధ పడిపోతోందిట. ప్చ్..కేథరిన్!!

-సమీర్