AADIVAVRAM - Others

పదేళ్ల ప్రయాణం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

టాలీవుడ్‌లోకి అడుగుపెట్టి అటు తర్వాత కోలీవుడ్‌లోనూ తన సత్తాను చాటుకున్న అందాలతార అనుష్క ప్రస్తుతం తెరపై పదేళ్ల ప్రయాణాన్ని పూర్తి చేసింది. ఎన్నో ఉత్తమ చిత్రాలు.. మరెన్నో వైవిధ్యమైన పాత్రలు.. ఇలా ఒకటేమిటి ఎన్నో..ఎనె్నన్నో విజయాలు సాధించి అగ్రతారగా వెలుగులు విరజిమ్ముతూనే వుంది. తెలుగులో మంచి పాపులారిటీ రాగానే చాలామంది తారలు బాలీవుడ్‌వైపు తొంగిచూస్తారు. అలా తొంగిచూడటం వల్ల తమ కెరీర్ ఎక్కడికోవెళుతుందన్న ఆశ వారిలో సహజంగా వుంటుంది. కానీ, అనుష్క అందుకు పూర్తి విరుద్ధం. ఇది కచ్చితంగా నిజమని ఆమె కెరీర్ చూస్తేనే తెలుస్తుంది. తెలుగులో మంచి అవకాశాలు వస్తున్నప్పుడు ఇతర భాషలవైపు చూడటం అత్యాశే అవుతుందన్న ఆలోచన అనుష్కది. అయితే కోలీవుడ్‌లో మంచి ఆఫర్లు అనుష్కకు రావడంతో వద్దనలేకపోయింది. అక్కడా అనుష్క అంటే ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ ఏర్పడింది. తాజాగా ‘బాహుబలి ది కన్‌క్లూజన్’ ‘్భగ్‌మతి’, ‘ఓం నమో వెంకటేశాయ’ చిత్రాల్లో నటిస్తూ తెలుగులో యమబిజీగావుంది. వీటితో పాటు కోలీవుడ్ చిత్రాలలో కూడా నటిస్తూ రెండు చోట్లా తిరుగులేని తారగా దూసుకెళుతూనే వుంది. పదేళ్ల కెరీర్‌లో ఏం సాధించాననుకుంటున్నారని అనుష్కను కదిలిస్తే- ‘‘ మంచి పేరుతో పాటు.. ప్రేక్షకుల హృదయాల్లో అంతకంటే మంచి స్థానం. పరిశ్రమలో అందరి సహకారం..ఇంతకంటే ఓ నటికి ఇంకేం కావాలి? అందరూ ఇలా ఆదరిస్తున్నారు కాబట్టే ఇప్పటికీ నా కెరీర్ ఇలా సాగుతోంది. ఎన్నో ఉత్తమమైన పాత్రలు..మంచి బ్యానర్లు.. మేటి నటులు...నా కెరీర్‌లో ఇలా చెప్పుకుంటూపోతే లెక్కకుమించే వుంటాయి. రాబోయే నా చిత్రాలు నాకు మరింత గుర్తింపుని తెచ్చిపెడతాయన్న నమ్మకం నాలో మెండుగావుంది. ఇందులో నిజమెంతుందో మీరే చూస్తారు’’ అంటూ ఎంతో ఆనందంతో చెప్పుకొచ్చింది అనుష్క. వాహ్..అనుష్క రియల్లీ గ్రేట్!!