'క్లాప్' కొట్టు గురూ!

అరుదైన క్యారెక్టరే!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

‘‘జీవితంలో కొన్ని పాత్రలు కొంతమందికి తీపి జ్ఞాపకాలను మిగుల్చుతాయి. అలాంటి అవకాశం అందరీకీ రాదు. అవి కొందరికే రాసిపెట్టి వుంటాయి. అలా వచ్చిన అరుదైన అవకాశాలను సక్రమంగా సద్వినియోగం చేసుకున్నప్పుడే ఏ తార కెరీర్ అయినా సరైన మార్గంలో పయనిస్తుంది. నా మటుకు నాకు అలాంటి చక్కటి అవకాశాలు రాబట్టే నేను ఇలా వుండగలిగాను. బాలీవుడ్‌లో అడుగుపెట్టిన నాటి నుంచి నేటి వరకు నేను వెనక్కి తిరిగి చూసుకోలేదు. మంచి బ్యానర్స్...మంచి క్యారెక్టర్స్..నా వశం అయ్యాయి. వాటిని సరైన రీతిలో ఉపయోగించడం వల్లే నేను సక్సెస్ కాగలిగాను’’అంటోంది బాలీవుడ్ బ్యూటీ, సెనే్సషనల్ హీరోయిన్ దీపికా పదుకొనే. బాలీవుడ్‌లో ఎన్నో సినిమాల్లో మరచిపోలేని పాత్రలు పోషించిన ఈ భామ ఇప్పుడు హాలీవుడ్‌లోనూ తన ప్రతిభను చాటుకుంటోంది. హాలీవుడ్‌లో తను నటిస్తున్న తాజా చిత్రం ‘త్రిబుల్ క్స్: జాండర్ కేజ్’. ఇందులో విన్ డీజిల్ సరసన అంటే మాటలు కాదు..చేతలు కావాలి. ఆ చేతలే తను చూపిస్తున్నానంటోంది కూడా. ఈ చిత్రంలో సెరెనా పాత్రలో కనిపించనుంది. సెరెనాకు బ్యాడ్‌బాయ్స్ అంటే ఇష్టమట. మంచి అబ్బాయిలను అస్సలు నమ్మదట. ఎంతో విచిత్రంగా వున్న ఈ పాత్ర చేస్తుంటే చాలా గొప్పగా ఫీలవుతుందట. అంతేకాదు..ఎంతగానో ఎంజాయ్‌కూడా చేస్తుందట. నేను చేసిన అరుదైన పాత్రల్లో ఈ సెరెనా పాత్ర కూడా ఒకటి అని చెప్పుకుంటుందిట. అదీ..సంగతీ!! బాలీవుడ్డే కాదు, హాలీవుడ్డులోనూ దీపికా తానేంటో నిరూపించుకుంటానంటోందిట. ఆల్ ది బెస్ట్ దీపికా!!