తెలంగాణ

సోనియా, రాహుల్‌పై కక్ష సాధింపు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కేంద్రంపై సిఎల్‌పి నేత జానారెడ్డి విమర్శ

హాలియా, డిసెంబర్ 19: సోనియాగాంధీ, రాహుల్‌గాంధీపై కేంద్ర ప్రభుత్వం అక్రమ కేసులు బనాయిస్తూ కుట్రపూరితంగా వ్యవహరిస్తోందని సిఎల్‌పి నేత జానారెడ్డి ఆరోపించారు. శనివారం నల్లగొండ జిల్లా హాలియాలో ఏర్పాటుచేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నేషనల్ హెరాల్డ్‌లో సోనియాగాంధీ, రాహుల్‌గాంధీలను ఇరికించి నెహ్రూ కుటుంబాన్ని, కాంగ్రెస్‌ను అప్రతిష్టపాలు చేసేందుకు మోదీ ప్రయత్నిస్తున్నారని ఆయన అన్నారు. నల్లధనాన్ని తీసుకొస్తానని, ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు ఇస్తానని కేంద్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చిన హామీని తుంగలో తొక్కిందన్నారు. ఆహారభద్రత చట్టం, విద్యాహక్కు చట్టాన్ని అమలుచేయడంలో విఫలం చెందిందని ఆరోపించారు. కేంద్ర ప్రభుత్వం ఆర్‌ఎస్‌ఎస్ ప్రణాళిక ప్రకారం బిజెపి పాలన కొనసాగుతుందని ఆరోపించారు. కార్పొరేట్, పెట్టుబడిదారీ వ్యవస్థను ప్రోత్సహిస్తూ పేద ప్రజల సమస్యలను గాలికొదిలిందన్నారు. కాంగ్రెస్‌పై, నెహ్రూ కుటుంబాన్ని లక్ష్యంగా చేసుకొని మోదీ సర్కార్ మాట్లాడడం హేయమైన చర్య అన్నారు. రాష్ట్ర ప్రభుత్వం పనితీరు హామీలకే పరిమితమయిందన్నారు. ప్రతిపక్షాలను అణగదొక్కేందుకు టిఆర్‌ఎస్ సర్కార్ ప్రయత్నిస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రాజకీయాలను కలుషితం చేసి అనైతికతకు పాల్పడుతుందన్నారు. డబ్బు, అధికారబలం, బెదిరింపులతో పార్టీ ఫిరాయింపులకు పాల్పడుతోందని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ అభ్యర్ది రాజగోపాల్‌రెడ్డి విజయం ఖాయమన్నారు. మిర్యాలగూడలో రాజీవ్‌భవన్ నుండి సిఎల్‌పి నాయకులు జానారెడ్డి, ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావుల నాయకత్వంలో ర్యాలీగా రాజీవ్‌చౌక్‌కు వచ్చి ధర్నా నిర్వహించారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ దిష్టిబొమ్మను దగ్ధం చేశారు.