రాష్ట్రీయం

మైనింగ్‌పైనా శ్వేతపత్రం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గనుల శాఖ పనితీరును సమీక్షించిన సిఎం

విజయవాడ, నవంబర్ 23: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం మైనింగ్ విధానంపైనా శే్వతపత్రం విడుదల చేయనుంది. సోమవారం తన క్యాంప్ కార్యాలయంలో గనుల శాఖ పనితీరును సిఎం చంద్రబాబు సమీక్షించారు. గనుల కార్యకలాపాలను సమర్ధంగా నిర్వహించాలని మార్గదర్శనం చేశారు. ఎక్కడా నిర్వహణ లోపాలు ఉండకూడదని అధికారులను ఆదేశించారు. స్వయం సహాయక సంఘాల మహిళలు ఇసుక క్వారీల నిర్వహణను చూస్తున్నారని వివరించారు. రీచ్ నుంచి ఇసుక వినియోగదారునికి చేరే సమయాన్ని పరిగణనలోకి తీసుకోవాలని, రవాణా చార్జీలు ఎంత అవుతున్నాయో కూడా పరిశీలించాలని సిఎం సూచించారు. వినియోగదారుడికి సంతృప్తికర స్థాయిలో ఇసుక అందించటమే తమ ధ్యేయమని చంద్రబాబు స్పష్టం చేశారు. ఆర్డరు వచ్చిన 24 గంటల్లో ఇసుక అందించేలా తమ ప్రభుత్వం చర్యలు తీసుకుందని, క్షేత్రస్థాయిలో అక్కడక్కడా లోపాలుంటే సరిచేసుకోవాలని, మంగళవారం నిర్వహించే సమీక్ష సమావేశంలో శే్వతపత్రంలో పొందుపర్చాల్సిన అంశాలపై క్షుణ్ణంగా చర్చించాలని నిర్ణయించారు. పొరుగున ఉన్న తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల్లో ఇసుక క్వారీల నిర్వహణ ఎలావుందో పరిశీలించాలని, రవాణా చార్జీలను ఏరీతిన వసూలు చేస్తున్నారో అధ్యయనం చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. మాఫియా ఆగడాలు నిరోధిస్తామని చెప్పారు. ప్రభుత్వానికి మైనింగ్ ద్వారా అధిక ఆదాయం లభించే కార్యాచరణ తయారు చేయాలని కోరారు. సమావేశంలో రాష్ట్ర మంత్రులు యనమల రామకృష్ణుడు, కె అచ్చెన్నాయుడు, పీతల సుజాత, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు.