రాష్ట్రీయం

సీఎం చంద్రబాబు దీక్షకు భారీ ఏర్పాట్లు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి: విభజన చట్టంలోని హామీలను అమలు చేయాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేస్తున్న ఒక్కరోజు దీక్షకు సంబంధించిన ఏర్పాట్లను దేవినేని ఉమామహేశ్వరరావు తదితర మంత్రులు పర్యవేక్షించారు. బాబు దీక్షకు మద్దతుగా మంత్రులు, ఎమ్మెల్యేలు దీక్ష చేస్తారని, తెలుగోడి సత్తా ఢీల్లీకి చాటుతామని వెల్లడించారు. 200 మంది కూర్చునే విధంగా దీక్షావేదిక ఏర్పాటుచేస్తున్నామని ఏపీ మంత్రులు దేవినేని ఉమామహేశ్వరరావు అన్నారు. దీక్షకు మద్దతుగా 175 నియోజకవర్గాల్లో సంఘీభావ సభలు ఉంటాయని మంత్రులు వెల్లడించారు. 70కి పైగా వివిధ సంఘాల ప్రతినిధులు హాజరవుతారని అంచనావేస్తున్నారు. అలాగే దీక్షకు వచ్చేవారి కోసం సిద్దార్ధ్, బీఆర్టీ ప్రాంతాల్లో పార్కింగ్ సౌకర్యాన్ని ఏర్పాటుచేశారు. చంద్రబాబుతో పాటు ఈ దీక్షలో పలువురు మంత్రులు కూడా పాల్గొననున్నారు.