హైదరాబాద్

సిఎం విజన్‌కు అనుకూలంగా పనిచేద్దాం: మేయర్

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, ఫిబ్రవరి 12: నగరాన్ని గ్లోబల్ సిటీగా తీర్చిదిద్దేందుకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజన్‌కు తగిన విధంగా చక్కటి సమన్వయంతో పనిచేద్దామంటూ అధికారులకు సూచించారు గ్రేటర్ కొత్త మేయర్ బొంతు రామ్మోహన్. శుక్రవారం మేయర్‌గా బాధ్యతలు చేపట్టినానంతరం ఆయన తన ఛాంబర్‌లో కమిషనర్ జనార్దన్‌రెడ్డి ఇతర అధికారులతో తొలి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. అన్ని శాఖల అధికారులు, పాలక మండలితో పాటు ప్రజలను కూడా కలుపుకుని పనిచేసినపుడే ప్రజల ఆకాంక్షలను నెరవేర్చే అవకాశముంటుందని ఆయన వివరించారు. ముఖ్యంగా నగరంలో వౌలిక వసతులకు సంబంధించిన ఫిర్యాదులెక్కువగా వస్తాయని, ఇలాంటి చిన్న చిన్న సమస్యలకు అధికారులు వెంటనే స్పందించి సమస్యను పరిష్కరించేందుకు అధికారులు వేగం పెంచాలని సూచించారు. నగరంలోని అన్ని రకాల సమస్యల పరిష్కారం కోసం దీర్ఘకాలిక ప్రణాళికలను నిర్థారిత లక్ష్యాలకు అనుగుణంగా పూర్తి చేసేందుకు గాను వంద రోజుల యాక్షన్ ప్లాన్‌ను సిద్ధం చేయాలని ఆదేశించారు. గ్లోబల్ సిటీ దిశగా మరిన్ని అభివృద్ధి పనులు చేపట్టేందుకు నిధులు అవసరమని, ఇందుకు గాను ఆస్తిపన్ను వసూళ్లను సమర్ధవంతగా చేపట్టాలని ఆదేశించారు. మొండి బకాయిల వసూళ్ల విషయంలో తాను, డిప్యూటీ మేయర్ కూడా తప్పకుండా కృషి చేస్తామని అధికారులకు మేయర్ హామీ ఇచ్చారు.
జిహెచ్‌ఎంసిలో రోజురోజుకి పెరుగుతున్న పని భారానికి తగిన విధంగా సిబ్బంది లేకపోవటాన్ని తాము గుర్తించామని, ఈ విషయంలో త్వరలో ముఖ్యమంత్రి కెసిఆర్‌ను కలిసి చర్చించనున్నట్లు మేయర్ తెలిపారు. దీంతో పాటు స్టాండింగ్ కమిటీ సభ్యులు, కో ఆప్షన్ సభ్యుల ఎన్నికకు సంబంధించి వెంటనే తగిన చర్యలు తీసుకోవాలని కూడా ముఖ్యమంత్రిని కోరనున్నట్లు వివరించారు. ఈ సందర్భంగా జిహెచ్‌ఎంసి ఆధ్వర్యంలో కొనసాగుతున్న వివిధ అభివృద్ధి పనులు, అమలవుతున్న సంక్షేమ పథకాల అమల్లో ఎదురవుతున్న సవాళ్లను కమిషనర్ జనార్దన్‌రెడ్డి మేయర్‌కు వివరించారు. ఈ సమావేశంలో అదనపు కమిషనర్లు సురేంద్రమోహన్, రామకృష్ణారావు, శంకరయ్య, రవికిరణ్, జయరాజ్ కెనడీ, భాస్కరచారి తదితరులున్నారు.