తెలంగాణ

త్వరలో కొత్త జిల్లాల ఏర్పాటు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

శాసనసభ, మండలి సీట్ల హెచ్చింపు
జిల్లా ప్రణాళికా బోర్డుల పునరుద్ధరణ
ఫీజు రీయంబర్స్‌మెంట్‌కు రూ. 2300 కోట్లు
కరవుపై చర్చకు రెడీ
శాసనమండలిలో సిఎం కెసిఆర్ ప్రకటన
హైదరాబాద్, మార్చి 13: రాష్ట్రంలో త్వరలోనే కొత్త జిల్లాలు ఏర్పాటవుతాయని సిఎం కె. చంద్రశేఖరరావు ప్రకటించారు. మండలిలో గవర్నర్ ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై మాట్లాడుతూ పరిపాలనా సౌలభ్యం కోసం కొత్త జిల్లాలను ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందన్నారు. అన్నికోణాల్లో ఆలోచించి, ప్రజలకు అనువుగా ఉండేలా కొత్త జిల్లాల ఏర్పాటు జరుపుతామన్నారు. సభలో ప్రస్తుతమున్న 119 సీట్ల సంఖ్యను 153కు పెంచేందుకు, మండలిలో ప్రస్తుత 40 సీట్లను 50కి పెంచాలన్న ప్రతిపాదన చేశామన్నారు. ఏపీ సిఎం, తానూ కేంద్రానికి లేఖలు రాశామని, కేంద్రం సానుకూలంగానే ఉందన్నారు. రాష్ట్రంలో కరవు నెలకొని ఉందని, ఈ అంశంపై సభలో చర్చకు ప్రభుత్వం సిద్ధంగా ఉందన్నారు. గవర్నర్ ప్రసంగంలో కరవు పరిస్థితి గురించి ప్రస్తావించలేదని సిఎం అన్నారు. కరవు పరిస్థితిపై సభలో చర్చించేందుకు బిజినెస్ అడ్వయిజరీ కమిటి (బిఏసి)లో నిర్ణయం తీసుకుంటుందన్న కారణంతో గవర్నర్ ప్రసంగంలో ప్రస్తావించలేదన్నారు. జిల్లాస్థాయిలో జిల్లా ప్రణాళికా బోర్డులను పునరుద్దరించే విషయం ఆలోచిస్తామని కెసిఆర్ తెలిపారు. గతంలో ఈ బోర్డులకు ఇతర జిల్లాలకు చెందిన మంత్రులు అధ్యక్షులుగా ఉండేవారని, ఈ విధానానికి స్వస్తి పలికి, సంబంధిత జిల్లా సీనియర్ మంత్రినే అధ్యక్షుడిగా ఉండేలా చర్యలు తీసుకుంటామన్నారు. ఫీజుల రీఇంబర్స్‌మెంట్ కోసం ఈ సంవత్సరం 2,300 కోట్ల రూపాయలు కేటాయించామన్నారు. అర్హులైన విద్యార్థులందరికీ ఫీజురీఇంబర్స్‌మెంట్ సౌకర్యం కల్పిస్తున్నామన్నారు.