ఆంధ్రప్రదేశ్‌

ప్రగతిని అడ్డుకోవడమే వారి ధ్యేయం: ఎపి సిఎం చంద్రబాబు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ: అభివృద్ధిని అడ్డుకోవడమే అరాచక శక్తుల ఆలోచనగా కనిపిస్తోందని, ఈ ఉద్దేశంతోనే కాపు గర్జన సందర్భంగా తునిలో హింసకు పాల్పడ్డారని ఎపి సిఎం చంద్రబాబు అన్నారు. ఆయన మంగళవారం టిడిపి ముఖ్యనేతలు, మంత్రులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన సందర్భంగా మాట్లాడుతూ, వైకాపా అధినేత జగన్ కొంతమందిని ప్రేరేపించడం వల్లనే తునిలో హింసాత్మక సంఘటనలు సంభవించాయన్నారు. కాపు కులస్థులకు రిజర్వేషన్ల విషయమై గతంలో ఇచ్చిన హామీలకు కట్టుబడి ఉంటానని, జీవో నెంబర్ 30 గురించి ఆయన వివరించారు. ఇది రిజర్వేషన్లకు సంబంధించిన జీవో కాదని, వాస్తవ పరిస్థితులను వివరించేందుకు పార్టీ నేతలు, మంత్రులు కృషి చేయాలని సూచించారు.