జాతీయ వార్తలు

కాంగ్రెస్ సహకారం వల్లే సజావుగా బడ్జెట్ సమావేశాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాంగ్రెస్ నాయకుల స్పష్టీకరణ

న్యూఢిల్లీ, మార్చి 17: కాంగ్రెస్ పార్టీ విశాల హృదయంతో క్రియాత్మకంగా వ్యవహరించటం వల్లనే పార్లమెంటు బడ్జెట్ మొదటి దశ సమావేశాలు సజావుగా జరిగాయి తప్ప ఎన్‌డిఏ ప్రభుత్వం గొప్ప తనంతో కాదని రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాం నబీ ఆజాద్, లోక్‌సభ సీనియర్ సభ్యుడు వీరప్పమొయిలీ, అధికార ప్రతినిధి రణదీప్ సింగ్ సుర్జేవాలా స్పష్టం చేశారు. ముగ్గురు సీనియర్ కాంగ్రెస్ నాయకులు గురువారం ఏఐసిసి విలేఖరుల సమావేశంలో మాట్లాడుతూ బడ్జెట్ మొదటి దశ సమావేశాలు సజావుగా జరగడానికి ప్రధాన కారణం కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియా గాంధీ, ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ అని వారన్నారు. పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగాలని కాంగ్రెస్ ఎప్పు డూ కోరుకుంటుంది, అయితే ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయాలు తీసుకోవటం, మొండిగా వ్యవహరించటం వల్లనే ఉభయ సభలు స్తంభించిపోయేవని వారు విమర్శించారు. లోక్‌సభలో ఎన్‌డిఏకు మెజారిటీ ఉన్నా, రాజ్యసభలో తమదే మెజారిటీ కాబట్టి తాము సహకరించటం వల్లనే బడ్జెట్ మొదటి దశ సమావేశాలు సజావుగా జరిగాయని ఆజాద్, వీరప్పమొయిలీ ప్రకటించారు. రాజ్యసభ చాలా సార్లు సాయంత్రం ఆరుగంటల తరువాత కూడా పని చేసింది. బుధవారం రాత్రి పదకొండు గంటల వరకు కొనసాగిందన్నారు. కాంగ్రెస్ డిమాండ్ చేయటం వల్లనే రాజ్యసభ ఎక్కువ గంటలు పని చేసిందని ఆజాద్ తెలిపారు. రాజ్యసభ సమావేశ సమయం పొడిగించాలని ఏ రోజు కూడా ఎన్‌డిఏ కోరలేదు, కాం గ్రెస్ ప్రతిరోజు సమావేశ సమయం పొడిగించాలని కోరిందని ఆజాద్ చెప్పారు. ప్రతిపక్షాల మూలంగా పార్లమెంటు సమావేశాలు సజావుగా జరగటం లేదంటూ బిజెపి అధినాయకులు గతంలో చేసిన ప్రచారం తప్పని ఇది రుజువు చేస్తోందని ముగ్గురు నాయకులు వాదించారు. అధికార పక్షం వ్యవహరించే తీరుపైననే పార్లమెంటు సమావేశాలు ఆధారపడి ఉంటాయని ఆజాద్ స్పష్టం చేశారు. లోక్‌సభ, రాజ్యసభల్లో కాంగ్రెస్ పార్టీ ఈ సారి ఎన్నో అంశాలను ప్రస్తావించి చర్చ జరిపిందన్నారు. లోకసభలో కాంగ్రెస్ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ ముందుండి నడిపించారు, పలు అంశాలపై మాట్లాడారని ఆజాద్ వివరించారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ లాహోర్ వెళ్లి వచ్చిన వారం రోజులకే పఠాన్‌కోట్ దుర్ఘటన జరగటం ఎన్‌డిఏ విదేశాంగ విధానంలో ఉన్న లోపాలను ఎత్తి చూపించిందని కాంగ్రెస్ నాయకులు చెప్పారు. రాహుల్ గాంధీ దేశానికి సంబంధించిన పలు ముఖ్యమైన అంశాల గురించి లోక్‌సభలో చర్చించారన్నారు. బడ్జెట్‌పై పూర్తి చర్చ జరగటం, పలు బిల్లులకు ఆమోదం తెలపటం వెనక కాంగ్రెస్ సహకారం ఉన్నదని ఆజాద్ స్పష్టం చేశారు. లోక్‌సభ, రాజ్యసభలో కాంగ్రెస్ పార్టీ లేవదీసిన అంశాలకు ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఎన్‌డిఏ ప్రభుత్వం సరైన సమాధానాలు ఇవ్వలేదని ఆజాద్ విమర్శించారు. ప్రభుత్వం చిత్తశుద్ధితో వ్యవహరిస్తే ఉభయ సభలు మరింత సజావుగా జరిగేవని వారు తెలిపారు. రాహుల్‌గాంధీ పౌరసత్వం అంశాన్ని ఎథిక్స్ కమిటీకి పంపించటం ద్వారా ప్రభుత్వం తప్పు చేసిందని వీరప్పమొయిలీ దుయ్యబట్టారు. ప్రభుత్వం అనాలోచిత విధానానికి ఇది నిదర్శనమని విమర్శించారు. ఆధార్ బిల్లును మనీ బిల్లుగా ప్రతిపాదించటం నియమాలకు విరుద్ధమని ఆయన చెప్పారు.